
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. ఎమ్మెల్యే కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయన గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు.
ఈ క్రమంలో శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను కడపలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. గతంలో ఎముకల డాక్టర్‌గా పనిచేసిన వెంకట సుబ్బయ్య.. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఈయనకు భార్య, ఇంటర్ చదువుతున్న కుమారుడు, ఎంబిబిఎస్ నాలుగో ఏడాది చదువుతున్న కుమార్తె ఉన్నారు.
1960లో జన్మించిన ఆయన స్వస్థలం బద్వేలు పురపాలకలోని మల్లెలవారిపల్లి. మారుమూల గ్రామంలో జన్మించినా.. వైద్య వృత్తిని చేపట్టాలని వెంకట సుబ్బయ్య కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ చేశారు. అనంతరం కామినేని, అపోలో ఆస్పత్రుల్లో కొంతకాలం సేవలు అందించారు. ఈయన భార్య కూడా వైద్యురాలిగా ఉన్నారు.
More Stories
ఏపీలో శ్రీకాకుళంలో కొత్తగా ఎయిర్ పోర్ట్
తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలి
అసెంబ్లీకి దొంగల్లా వచ్చి వెళ్లడం ఏంటి?