ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. నీలం సాహ్ని పేరును గవర్నర్ బీబీ హరిచందన్ ఆమోదించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని ఉన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్‌ ఐఏఎస్‌ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించింది.  ఎస్‌ఈసీని నియమించేందుకు ప్రభుత్వం నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను ప్రభుత్వం ప్రాతపాదించగా,  చివరికి సాహ్నిని ఎంపిక చేశారు.
 
 ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. ఆ తర్వాత ఆయన స్థానంలో ఆమె ప్రదవి చేబడతారు. 1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాహ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం టెక్కటి సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.
 
 తర్వాత నల్గొండ జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పనిచేశారు. మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటి సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా పనిచేశారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పనిచేశారు. కుటుంబ సంక్షేమ శాఖలో పలు విభాగాల్లో పనిచేశారు.
 
అంతేకాకుండా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఏపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. ఆ తర్వాత స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విమరణ పొందారు.