టెస్ట్-ట్రాక్-ట్రీట్ ప్రోటోకాల్‌ ఖచ్చితంగా అమలు 

టెస్ట్-ట్రాక్-ట్రీట్ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.: కరోనా వైరస్ నియంత్రణ, జాగ్రత్తల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు వచ్చే నెల 1 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చి.. ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటాయి.

దేశంలోని అనేక ప్రాంతాల్లో కోవిద్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. పొరుగు దేశాలతో ఒప్పందాల ప్రకారం భూ సరిహద్దు వాణిజ్యానికి అడ్డంగా ఉన్న వ్యక్తులు, వస్తువుల అంతర్రాష్ట్ర కదలికలపై ఎటువంటి పరిమితి ఉండకూడదని కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అటువంటి కదలికలకు ప్రత్యేక అనుమతి / ఆమోదం / ఈ-పర్మిట్ అవసరం లేదని ఎంహెచ్‌ఏ తెలిపింది.

ఆర్టీ-పీసీఆర్ పరీక్షల నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాలు, యూటీలు వీటి విషయంలో వేగంగా పెంచాలని, నిర్ణీత స్థాయి 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరుకోవాలన్నది. ఇంటెన్సివ్ టెస్టింగ్ ఫలితంగా గుర్తించిన వారిని ఐసోలోషన్‌లో ఉంచి వారికి సకాలంలో చికిత్స అందించాలని ఎంహెచ్‌ఏ తెలిపింది.

ప్రతిఒక్కరూ కొవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని, నిర్ణీత దూరం పాటిస్తూనే ముక్కుకు తప్పనిసరిగా మాస్కులను వాడాలని కోరింది. టీకాల డ్రైవ్‌ను పెంచడానికి, అన్ని లక్ష్య సమూహాలను కవర్ చేయడానికి రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వం సహకరించాలని సూచించింది.

ఆర్టీ-పీసీఆర్ పరీక్షల నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాలు, యూటీలు వీటి విషయంలో వేగంగా పెంచాలని, నిర్ణీత స్థాయి 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరుకోవాలన్నది. ఇంటెన్సివ్ టెస్టింగ్ ఫలితంగా గుర్తించిన వారిని ఐసోలోషన్‌లో ఉంచి వారికి సకాలంలో చికిత్స అందించాలని ఎంహెచ్‌ఏ తెలిపింది.

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, రద్దీ ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా ప్రోత్సహించేలా చూడాలని రాష్ట్రాలు, యూటీ ప్రభుత్వాలను కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై తగిన జరిమానాలు విధించడంతో పాటు పరిపాలనా చర్యలను తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.