ఏపీలో పెట్రోల్‌పై 31% పన్ను

ఆంధ్ర ప్రదేశ్లో  పెట్రోల్‌పై 31 శాతం, డీజీల్‌పై 22.25 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) వసూలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాట్‌తోపాటు ఈ రెండింటిపై లీటరుకు రూ.4 చొప్పున లెవీ, రూ.1 చొప్పున రోడ్‌ డెవల్‌పమెంట్‌ సెస్‌ వసూలు చేస్తున్నారని వెల్లడించింది.

లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమాధానమిచ్చారు. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై 2.5% కస్టమ్స్‌ డ్యూటీ, దానిపై 10శాతం సామాజిక సంక్షేమ సర్‌చార్జ్‌, పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం లీటరుకు రూ.32.90, డీజిల్‌పై లీటరుకు రూ.31.80 వసూలు చేస్తోందని మంత్రి చెప్పారు. 

అంతర్జాతీయ ధరలు, మారకపు రేటు, పన్ను వ్యవస్థ, రవాణా, ఇతర ఖర్చుల ఆధారంగా చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిర్ణయిస్తాయని వివరించారు.

 
.