తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. పంచాయతీ, మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

అలాగే ఈ నెల 31న పరిశీలిస్తారు. ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంది. ఏప్రిల్ 17న పోలింగ్ కాగా, మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

కాగా తిరుపతి ఉప ఎన్నికకు వైసీపీ నుంచి ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురుమూర్తి పేరును ఖరారు చేశారు. టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి బరిలోకి దిగుతున్నారు. అలాగే బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించనున్నారు. 

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికకు సంబంధించిన తేదీలను వెల్లడిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె. విజయానంద్ విడుదల చేశారు.