సేవా భారతి ఆధ్వర్యంలో “రన్ ఫర్ గర్ల్ చైల్డ్”

సేవా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో  బాలికల  సాధికారత కోసం , ఇందుకు కృషి చేస్తున్న “కిషోరి వికాస్” కార్యక్రమం గురించి అవగాహన కల్పించడానికి రన్ ఫర్ గర్ల్ చైల్డ్ నిర్వహించారు.  మొత్తం గా 21/10/5 కె రన్   విభాగాలలో 5వ ఎడిషన్‌ గచ్చిబౌలి లో ఆదివారం వేకువ జామున ఉత్సాహంగా జరిగింది. 
 
ఈ రన్ ను  హై కోర్టు న్యాయమూర్తి  జస్టీస్  లక్ష్మణ్, అపోలో ఆస్పత్రి సీఈవో సుబ్రహ్మణ్యం తో  పాటు ఇతర  ప్రముఖులు ,  జండా ఊపి ప్రారంబించారు. 5, 10, 21 కిలోమీటర్ల, మేర మూడు విభాగాల్లో కొనసాగిన ఈ రన్ లో కార్పొరేట్‌లు, వారి కుటుంబాలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు  విద్యార్థులు.. మొత్తం గా పదిహేను వందలకు పైగా  పాల్గొన్నారు.  
 
ఈ రన్ గచిబౌలి స్టేడియం నుండి ప్రారంభమై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వరకు 5 కిలోమీటర్లు కొనసాగాయి, అదనపు విభాగాల్లో  సెంట్రల్ యూనివర్శిటీ మీదుగా 10 కిలోమీటర్లు,  21 కిలోమీటర్లు తిరిగి స్టేడియానికి చేసుకొన్నది. 
 
సేవా భారతి సంఘటనా మంత్రి వాసూజీ, తెలంగాణ సేవ భారతి కార్యదర్శి రామమూర్తి, సహ కార్యదర్శి జయప్రద, కిశోర్ వికాస్ ఇంచార్జ్ కిరణ్మయి, ప్రాయోజకులు డా. సుమలత తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.