బెంగాల్ ప్రచారం నాగరికంగా చేయండి

బిజెపికి ప్రతిష్టాకరంగా మారిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారాన్ని నాగరికంగా చేయాలని, ఎవ్వరు ప్రత్యర్థుల పేర్లు ప్రస్తావిస్తూ అసభ్యంగా మాట్లాడవద్దని, మొత్తం ప్రచారం సానుకూల ధోరణిలో ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్టీ నేతలకు స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. 
బెంగాల్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన పార్టీ నేతలతో గురువారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో విడివిడిగా సమావేశమై క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల గురించి ఆరాతీసారు. ఉద్రిక్తలు కలిగించడం పార్టీ ప్రచార వ్యూహంగా ఉండకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 
 
“పార్టీ ప్రచారం నాగరికంగా ఉండాలని, అధికారంలో ఉన్న టిఎంసి నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగవద్దని మాలో ప్రతిఒక్కరికి చెప్పారు” అని కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. “బెంగాల్ లో పార్టీకి ఉన్న సానుకూల పరిస్థితుల గురించి తెలిపే ముందు వాస్తవ పరిస్థితి ఏమిటి? మన పరిమితులు ఏమిటి? మన ప్రచారంలో లోపాలు ఏమిటి? నిస్పక్షపాతంగా చెప్పమని మాలో ప్రతి ఒక్కరిని ఆయన కోరారు” అని వివరించారు. 
ఈ సమావేశంలో మొదటి దశలో మే 27న ఎన్నికలు జరిగి 38  స్థానాలకు పార్టీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశారు. మొదటి దశలో పార్టీ ఎంపీలు ఎవ్వరు పొతే చేయనప్పటికీ, తర్వాతి దశలలో పోటీచేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు సంకేతం ఇచ్చాయి. “ప్రతి సీట్ ముఖ్యమైనదే. ఒక ఎంపీ అయితే ఏదైనా సీట్లు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసే అక్కడ ఎంపీని నిలబెడతాము” అంటి పార్టీ ప్రముఖుడు ఒకరు చెప్పారు.
అయితే ముఖ్యమంత్రి మమతా బనెర్జీ భవానీపూర్ నుండి తిరిగి పోటీ చేస్తే ఆమెపై కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోను నిలబెట్టవచ్చనే ఊహాగానాలు పార్టీ వర్గాలు కొట్టిపారవేశాయి. 2017లో టిఎంసి నుండి బీజేపీలో చేరిన పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం పట్ల ఉత్సాహం చూపుతున్నప్పటికీ పార్టీ అధిష్ఠానం అనుమతి ఇవ్వక పోవచ్చని కూడా పార్టీ వర్గాలు తెలిపాయి.