తారాస్థాయికి చేరిన ట్విట్టర్ వార్

తెలంగాణలో ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు రాంచందర్ రావు. తాను ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర వేచి చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. 
 
ఐతే రాంచందర్ రావు ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తాను కేంద్ర ప్రభుత్వం ఆరేళ్లలో ఇచ్చిన 12 కోట్ల ఉద్యోగాలు సహా  జన్ ధన్ ఖాతాల్లో 15 లక్షల పడిన వారి వివరాలు సేకరించడంలో బిజీగా ఉన్నానంటూ ట్వీట్ చేశారు. పైగా, ఎన్డీయే అంటే నో డేటా అవేలబుల్ అనే అర్థం వస్తోందన్న కేటీఆర్  మీకెమైనా వివరాలు తెలిస్తే చెప్పాలంటూ రాంచందర్ రావుకు కౌంటర్ ఇచ్చారు. 
 
ఈపాటికే ఆ వివరాలు సేకరించాల్సిందని, ఇప్పుడు జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు కల్పిత వివరాలు తయారుచేయొద్దని రామచందర్రావు హితవు చెప్పారు. కేటీఆర్ సందేహాలు తాను తీర్చుతాననీ, ట్విట్టర్ చాటున దాక్కోవద్దని రామచందర్ రావు
ఎద్దేవా చేశారు.