తెలంగాణలో మొబైల్‌టవర్లు పూర్తిగా సురక్షితం

తెలంగాణలో గల మొబైల్‌టవర్లు పూర్తిగా సురక్షితమని టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రజలకు భరోసా ఇచ్చింది.  మొబైల్ ఫోన్లు లేదా వాటి బేస్ స్టేషన్ల నుండి ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ (ఇఎంఎఫ్) ఎక్స్‌పోజర్‌ల నుండి మరియు టెలికాం టవర్ల నుండి వెలువడే ఈఎంఎఫ్  రేడియేషన్‌ లు కలిగించే దుష్ప్రభావల గురించి  ప్రజలో  కొంత ఆందోళన  నెలకొని ఉంది. 

జూన్ 2020,  ఫిబ్రవరి 2021 కాలం లో డిఓటి  టెలికాం సర్వీసు ప్రొవైడర్ల (టిఎస్పి),  బేస్ ట్రాన్స్సీవర్ యూనిట్లు (బిటిఎస్) పరిధి లోని  4245 మొబైల్ టవర్లను పరీక్షించింది. వీటిలో ఒక మొబైల్ టవర్‌ తప్ప అని మొబైల్ టవర్లు నిబంధనలకు లోబడి ఉన్నాయని డి ఓ టి ఒక ప్రకటనలో తెలిపింది.

మొబైల్ టవర్ నుండి ఈఎంఎఫ్ ఉద్గారాలను సురక్షిత బహిర్గతం పరిమితుల్లో నియంత్రించడానికి(డి ఓ టి) కఠినమైన చర్యలు  తీసుకుంటుంది.  మన టెలికాం టవర్లు యుఎస్ఎ, కెనడా, జపాన్ మరియు ఆస్ట్రేలియా వంటి  అభివృద్ధి చెందిన దేశాలు ప్రమాణాల తో పోలిస్తే ఎంతో మెరుగని డి ఓ టి ఒక ప్రకటన లో తెలిపింది. 

డి ఓ టి వల్ల  ప్రజలకు మొబైల్ టవర్లు , ఈఎంఎఫ్ ఉద్గారసమ్మతి వంటి సమాచారాన్ని అందుబాటులో ఉండటం కోసం తరంగ్ సాంచార్ www.tarangsanchar.gov.in అనే  వెబ్ పోర్టల్  ప్రారంభించింది. ఈ పోర్టల్  లో మొబైల్ టవర్ల పై పుర్తి  ఈఎంఎఫ్  సమ్మతి స్థితిపై సమాచారాన్ని పొందవచ్చు.

ఏదైనా టవర్ సైట్ గురించి పుర్తి సమాచారం కోసం లేదా  ఒక ప్రదేశంలోని ఈఏంఎఫ్ ఉద్గార కొలత కోసం ఈ  పోర్టల్ ని సంప్రదించవచ్చని అధికారులుతెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో వర్చువల్ సమావేశాలు మరియు వీడియో కాల్స్ ఉపయోగించే వినియోగదారులు పెరిగారు.

ఇ-సర్వీసెస్, ఒటిటి ప్లాట్‌ఫాంలు, ఇ-కామర్స్ మరియు ఇ-గవర్నెన్స్ వాడకం కూడా పెరిగింది .అందువల్ల, మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ / ఇంటర్నెట్ టెలికాం సేవల వినియోగం కూడా చాలా రెట్లు పెరిగిందని తెలిపారు.