రాజ్యసభ, లోక్ సభ టీవీ ఛానెళ్లు విలీనం

రాజ్యసభ, లోక్ సభ  టీవీ ఛానెళ్లను సంసద్ టీవీలో విలీనం చేశారు. రాజ్యసభ  చైర్మన్, లోక్ సభ స్పీకర్ లు  సంయుక్తంగా విలీన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం -మేఘాలయ కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రవి కపూర్ ను సిఇఓ గా నియమించారు. 
 
ఒక ఏడాది పాటు  కాంట్రాక్ట్ బేసిస్ లో సిఇఓ గా రవికపూర్ పనిచేస్తారు.  అస్సాం-మేఘాల‌యా క్యాడ‌ర్‌కు చెందిన ఆయన అస్సాంలో అద‌న‌పు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా చేశారు. అలాగే పెట్రోలియం మంత్రిత్వ‌శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 
పార్లమెంట్ ను హిందీలో సంసద్ అని  పిలుస్తారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు  రాజ్యసభ, లోక్ సభ  వేర్వేరు  ప్రత్యక్ష ప్రసారాలు చేస్తుంటాయి. పార్లమెంట్  సమావేశాలు లేనప్పుడు… మాత్రం  సంసద్ పేరుతో  ఒకే ఛానెల్   నడుస్తుంది. 35 కార్యక్రమాలు హింది,  ఇంగ్లీష్ భాషల్లో  ప్రసారం చేస్తున్నారు. 
 
రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ టీవీల‌ను ఏకం చేసేందుకు గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌, లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా నేతృత్వంలో ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు.