ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హిందూ ద్రోషి!

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హిందూ ద్రోషి!
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హిందూ ద్రోహి అని  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. హిందువులపై దాడులు హత్యలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.  ఢిల్లీలో జై శ్రీరామ్ అంటే చంపేస్తారా?..ఢిల్లీలో హిందువులు సేఫ్ గా ఉన్నారా? అని నిలదీసిరు. 
 
రింకు శర్మ అనే వ్యక్తి రామ మందిర నిర్మాణం కోసం నిధి సేకరణ చేస్తున్నాడని.. అందుకే స్థానిక ముస్లింలు రింక్ శర్మ ను టార్గెట్ చేశారని అయన పేర్కొన్నారు. ఆయన ఇంటికి పైన 50 మంది వరకు దాడి చేసి కత్తులతో పొడిచి చంపేశారని అయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
గతంలో కూడా ఢిల్లీలో హిందువుల పైదాడుల చేసి చంపేశారని తెలిపారు. రింకూ శర్మను హత్య చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్ష పడేలా చూడాలని రాజా సింగ్ డిమాండ్న్నా చేశారు. లేదంటే తమ చేతికి దొరికితే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. కేజ్రీవాల్ కు హిందువులు ఓట్లు వేయలేదా? ముస్లిం ఓట్లతోనే గెలిచారా ?అని నిలదీసేరు.