జీహెచ్‌ఎంసీ  మేయర్ ఎన్నికలో  టీఆర్ఎస్ దివాళాతనం

ఎంఐఎంతో  కలిసి హైదరాబాద్ మేయర్ పదవిని కైవసం చేసుకోవడం టీఆర్ఎస్ దివాళా కోరుతనానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.  జీహెచ్‌ఎంసీ   ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు ఓటు వేసిన మజ్లీస్ కి ఓటు వేసినా ఒకటే అని చెప్పామని ఆయన గుర్తు చేశారు. 
 
ఎన్నికల్లో కూడా ఇద్దరు కలిసి పోటీచేశారని, జ్లీస్ పోటీ చేసిన ప్రాంతంలో టీఆర్ఎస్ కనీసం పోటీ చేయలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.ఒవైసి కుటుంభం, కేసీఆర్ కుటుంభం ఒకటే… ఇద్దరు కలిసి ఒకటే ప్లేట్ లో బిర్యానీ తింటారని ధ్వజమెత్తారు. 
 
టీఆర్ఎస్ పరిపాలనలో హైదరాబాద్ ఎలాంటి అభివృద్ధి జరగలేదని కిషన్ రెడ్డి దయ్యబట్టారు. హైదరాబాద్ పాతబస్తీ అబివృద్ధిలో వెనకబడిందని… దానికి కారణం మజ్లీస్ పార్టీయేనని స్పష్టం చేశారు. జిఎచ్ఎంసి అవినీతిలో కూరుకు పోయినదని స్పష్టం చేశారు. 
 
మజ్లీస్ పార్టీకి అబివృద్ధి అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ మద్దతుతోనే మజ్లీస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. పాతబస్తీలో పోలీసులు, అధికారులు, రెవెన్యూశాఖ అధికారులను ఎవరిని తీసుకోవాలనేది దారు సలామ్ లో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. 
 
మజ్లీస్ పార్టీతో పొత్తు లేకుంటే టీఆర్ ఎస్ సింగిల్ డిజిట్ కి పడిపోయేదని తెలిపారు. హిందువులను, హిందూ దేవుళ్లను తిట్టే పార్టీ… హిందువులను ఉంచకోత కోస్తా అన్న పార్టీతో ఎలా పొత్తు పెట్టుకున్నావో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
 
రాజాకార్ల భావాలు కలిగిన పార్టీ మజ్లీస్ నాయకులకు టి ఆర్ ఎస్ నాయకులు ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలో ఎంఐఎం  పాత్ర ఉంటుందని తెలిపారు. తెలంగాణనను వ్యతిరేకించిన పార్టీ మజ్లీస్ పార్టీ…అలాంటి పార్టీతో టీఆర్ఎస్ ఎలా పొత్తు పెట్టుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
 ముఖ్యమంత్రి స్థాయిలో మహిళపై అగౌరవంగా మాట్లాడటం తప్పని ఏంటి ప్రభుత్వాలు చేసే తప్పులపై ప్రతిపక్షాలు పోరాడుతాయని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం మంచిది కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…..పోరాటాలు చేసే హక్కు అందరికి ఉంటుందని స్పష్టం చేశారు.