వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్) నుంచి తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆరోగ్యశ్రీతో కలిపి ఈ స్కీమ్‌ను అమలు చేస్తామని, ఆరోగ్యశ్రీని కూడా మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.
కోఠిలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంలో హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని అని విభాగాల హెచ్‌ఓడీలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసారి నేషనల్ హెల్త్ మిషన్ బడ్జెట్‌లో రాష్ట్రానికి అధికంగా నిధులు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందని తర్వాత మీడియాకు తెలిపారు.
ఆ నిధులతో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్లు, కేన్సర్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్‌లోనూ ఈసారి హెల్త్‌కు నిధులు పెంచి, కొత్త జిల్లా కేంద్రాల్లోని దవాఖాన్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే నిమ్స్‌లో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్‌ను, కేన్సర్ యూనిట్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని.. శనివారం నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని ఈటల ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయని.. అవసరమైన వారికి గాంధీ, చెస్ట్, కింగ్‌కోఠి, టిమ్స్ ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ అందజేస్తున్నామని పేర్కొన్నారు.
More Stories
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
క్షమాపణలు చెప్పిన వేణు స్వామి