హైదరాబాద్ యువతికి ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కింది. కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ కోసం చేస్తున్న సేవలకు గానూ తెలంగాణకు చెందిన 24 ఏళ్ల కీర్తి రెడ్డికి ఈ అవకాశం లభించింది. కీర్తి రెడ్డి హైదరాబాద్‌లో స్టాట్విగ్ అనే హెల్త్ కేర్ కంపెనీ నిర్వహిస్తోంది. ఆ కంపెనీ ద్వారా కరోనా వ్యాక్సిన్‌ను నిల్వచేస్తున్నారు. కీర్తిరెడ్డి స్టాట్విగ్ అనే వ్యాక్సిన్ ట్రాకింగ్‌ఆ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈమె ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలు కూడా.
ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి మేనేజ్‌మెంట్‌లో గ్లోబల్ మాస్టర్స్ పట్టాను కొత్త కీర్తి రెడ్డి పొందారు. తర్వాత సింగపూర్‌కు చెందిన సైప్లె చైన్ కంపెనీ క్యూనికస్‌తో కొంతకాలం పనిచేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన కొత్త కీర్తిరెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె. సొంతంగా బిజినె్‌సను ప్రారంభించి ప్రజలకు ఉపయోగపడే సేవలు అందిస్తానని కీర్తిరెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.
ఫోర్బ్స్ పత్రిక ప్రతి ఏటా వివిధ రంగాలలో రాణిస్తున్న 30 ఏళ్ళలోపు వారితో ఒక జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో కీర్తి రెడ్డితో సహా మరో 12 మంది మహిళలు చోటు సంపాదించుకున్నారు. వారిలో సినీ నటీమణులు కీర్తి సురేష్, తృప్తి దిమ్రి కూడా ఉండటం గమనార్హం. సుప్రీం కోర్టు న్యాయవాది పౌలోమీ పావని శుక్లా కూడా ఈ జాబితాలో చేరారు. ప్రముఖ నేపథ్య గాయని మాళవిక మనోజ్ కూడా ఈ ఘనతను సాధించింది.
More Stories
బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు నెగ్గిన తెలంగాణ పంతం
విదేశీ కరెన్సీలో చెల్లింపులపై కేటీఆర్ పై ఈడీ ప్రశ్నలు
కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు