జీడబ్ల్ యూఎంసీ ఆధ్వర్యంలో వరంగల్ లో ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ బాగుందంటూ మున్సిపల్ మంత్రి కేటీ ఆర్ శనివారం ఉదయం ట్విట్టర్ లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ‘మస్త్ ఉన్నది.. గ్రేట్ సార్’ అని కొందరు.. ‘జీడబ్ల్ యూఎంసీ ఎలక్షన్ స్టంట్’ అని మరొకొందరు కామెంట్ చేశారు.
వావ్ వరంగల్.. ఎక్సలెంట్ వీడియో అని కొందరు చెప్పగా.. మెగా టెక్స్టైల్ పార్క్ వీడియో ఎప్పుడు పెడతారని ఇంకొందరు సమాధానాలు ఇచ్చారు. అలాగే సైకిల్ ట్రాక్ ల నిర్వహణపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసి రీ పోస్టులు పెట్టారు.
కేటీఆర్ పోస్టుపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసినా కేంద్రం నగర అభివృద్ధికి సహకరిస్తుందని పేర్కొన్నారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ థ్యాంక్స్ చెప్పాలని హితవు చెప్పారు.
వీడియోలు పెట్టడం కంటే పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. కేంద్రం రైల్వే స్టేషన్లను అందంగా తీర్చిదిద్దితే.. రాష్ట్ర ప్రభుత్వం బస్టాండ్లను భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు.
More Stories
అల్లు అర్జున్ కు హైకోర్టులో మధ్యంతర బెయిల్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించండి కిషన్ రెడ్డి