రేవంత్ కిషన్ రెడ్డిని విమర్శించడమా!

కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డికి  బీజెపి పార్టీపై, ముఖ్యంగా కేంద్ర హోంశాఖా సహాయ మంత్రిగారయిని జి.కిషన్‌ రెడ్డిపై విమర్శించే అర్హత లేదని బీజేపీ ఎమ్యెల్సీ ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. తెరాస పార్టీ ద్వారానే రాజకీయ రంగప్రవేశం చేసిన రేవంత్‌ రెడ్డి తెదేపాలో చేరి తరువాత కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన కిషన్‌ రెడ్డిని విమర్శించడం అంటే సూర్యుని మీద ఉమ్మి వేయడమే అని మండిపడ్డారు.
టిడిపిలో చంద్రబాబు నాయుడు పక్కనచేరి, అతని పానలో జరిగిన అవినీతిలో బాగస్వామి అయిన రేవంత్‌ రెడ్డి, ఓటుకోసం కోట్లు ఇవ్వచూపి అడ్డంగా దొరికిన వ్యక్తి బీజెపి నాయకును విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అవినీతి కేసుల్లో రోజూ కోర్టుకు హాజరవుతున్న రేవంత్‌ రెడ్డి నీతి గురించి మాట్లాడ్డం,  అందునా కిషన్‌ రెడ్డిపై ఆరోపణు చేయడాన్ని ప్రజలు సహించరని హెచ్చరించారు.
“కోతికి కొబ్బరికాయ దొరికనట్లు నీకు కాంగ్రెస్‌ పార్టీలో పదవి దొరికింది, ఆ పార్టీ గుర్తుమీద గెలిచి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సోనియాగాంధీచే నియమింప పడ్డ నీవు ముందు నీ కాంగ్రెస్‌ పార్టీ అవీనీతి సరిచేసుకో” అంటూ హితవు చెప్పారు. 
 
కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మీద విమర్శలు మాని, కోమాలోకి వెల్లి వెంటిలేటర్‌ మీదున్న నీ కాంగ్రెస్‌ పార్టీ గురించి ఆలోచించుకో అను ఎద్దేవా చేశారు. మీ కాంగ్రెస్‌ నాయకుకు తెరాసా నాయకుకు మద్యఉన్న సంబందాలు, అనుబంధాల సంగతేంటో  ముందు తేల్చుకో అంటూ దుయ్యబట్టారు. 
 
నీ పార్టీ గుర్తుపై గెలిచిన శాసనసభ్యులను అపుకోలేని అసమర్ధ రేవంత్‌రెడ్డి టీఆర్‌ఆస్‌కు అమ్ముడుపోయిన మీ ఎమ్మేల్యేల గురించి మాట్లాడు అంటూ విమర్శించారు. తేలంగాణలో కాంగ్రెస్‌ పార్టీనీ నడిపిస్తున్నది టీఆర్‌ఎస్‌ అని తెలంగాణ ప్రజలందరికీ తెలుసని ధ్వజమెత్తారు.
మీ ఇరుపార్టీల ములాఖత్‌ను తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకున్నరు కాబట్టే ఇటీవల జరిగిన ఎన్నికలో కర్రుకాల్చి వాతపెట్టారని గుర్తు చేశారు.  అయినా కానీ బుద్దిరాని రేవంత్‌ రెడ్డి ఇంకా  బీజెపీపైన ప్రేలాపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నడూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహంచకుండా నిబద్దతతో,నిజాయితీగా అభివృద్దే లక్ష్యంగా, సిద్దాంతమే ఊపిరిగా 40 సంవత్సరాల రాజకీయ ప్రస్తానంలో చిన్న మఛ్చ కూడా లేని కిషన్‌ రెడ్డి మీద రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేయడం తెంగాణ ప్రజలు హర్షించరని హెచ్చరించారు.