
ప్రధాని నరేంద్ర మోదీని `నియంత’ అంటూ చెప్పబోయి ట్వీట్ చేసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నవ్వులపాలయ్యారు. ప్రపంచ నియంతల పేర్లన్నీ ‘ఎం’ అనే ఆంగ్ల అక్షరంతోనే ప్రారంభం అవుతాయంటూ ట్వీట్ చేసి రాహుల్ దుమారాన్ని రేపారు.
ఆయా నేతల పేర్లన్నీ ‘ఎం’ అనే ఆంగ్ల అక్షరంతోనే ఎందుకు మొదలవుతాయంటూ బుధవారం ట్వీట్ చేశారు. మార్కోస్ ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో పేర్లను రాహుల్ అందులో ఉదహరించారు.
అయితే కాంగ్రెస్ నేత మోతీలాల్ నెహ్రూ, మాజీ ప్రధాని మన్మోహన్ పేర్లు కూడా ‘ఎం’ తోనే మొదలవుతాయి కదా అంటూ కొంతమంది నెటిజన్లు ఎద్దేవా చేశారు. అలాగే మమతా బెనర్జీ, మాయావతి పేర్లను ప్రస్తావిస్తూ మరొకరు రాహుల్‌కి కౌంటర్ వేశారు.
అసలు ప్రధాని నరేంద్రమోదీ పేరు ‘ఎన్’ తో కదా స్టార్ట్ అయ్యేదంటూ మరికొందరు రాహుల్‌పై విరుచుకు పడుతున్నారు. దానితో కాంగ్రెస్ నేతలంతా ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది.
మహాత్మ గాంధీ పేరు మోహన్‌దాస్ సైతం ‘ఎం’ తోనే మొదలవుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ రాహుల్‌కు గుర్తు చేశారు. ఇక రాహుల్ గాంధీని సీరియస్‌గా తీసుకోవడం అవసరమా అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత