ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు నిరసనలపై విదేశాలకు చెందిన కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. దేశ ఐక్యతను ఎలాంటి దుష్ప్రచారం దెబ్బతీయలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. దేశం అత్యున్నత స్థాయికి చేరకుండా ఏ దుష్ప్రచారమూ నిలువరించలేదని ఓ ట్వీట్‌లో స్పష్టం చేశారు.
‘దుష్ప్రచారాలు భారతదేశ భవితవ్యాన్ని నిర్ణయించలేవు. అభివృద్ధి పైనే ఇండియా భవితవ్యం ఆధారపడి ఉంది. దేశం ఐక్యంగానే ఉంటుంది. అందరూ కలిసికట్టుగానే ప్రగతిని సాధిస్తాం’ అని అమిత్‌షా కుండబద్ధులు కొట్టారు. ఇండియా ఎగైనెస్ట్ ప్రోపగాండా, ఇండియా టుగెదర్ అంటూ తన ట్వీట్‌కు య్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా మనమంతా ఓ దేశంగా సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారత దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలుగకూడదని హెచ్చరించారు. బాహ్య శక్తులు కేవలం ప్రేక్షకులుగానే ఉండాలని, మన దేశ వ్యవహారాల్లో భాగస్వాములు కారాదని స్పష్టం చేశారు. భారత దేశం గురించి భారతీయులకు తెలుసునని, భారత దేశం కోసం ఏ నిర్ణయమైనా భారతీయులే తీసుకోవాలని స్పష్టం చేశారు.
అమిత్ షా, సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్‌లతో పాటు దేశంలోని చాలా మంది ప్రముఖులు ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. #దుష్ప్రచారాన్ని_భారత్_సాగనివ్
క్రికెటర్లు రవిశాస్త్రి, శిఖర్ ధావన్, సురేష్ రైనా, గౌతమ్ గంభీర్, అనిల్ కుంబ్లే, ఆర్‌పీ సింగ్.. సినీ ప్రముఖులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్, కరణ్ జోహార్‌లు ఇదే హ్యాష్‌ట్యాగ్‌పై ట్వీట్లు చేశారు. ఇప్పటి వరకు ఈ హ్యాష్‌ట్యాగ్‌పై 5.5 లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి. దీనితో పాటు మరో హ్యాష్‌ట్యాగ్ కూడా టాప్ ట్రెండింగ్‌లో ఉంది. #ఇండియా_టుగెద్ (ఐక్యంగా భారత్) అనే హ్యాష్‌ట్యాగ్‌పై కూడా 5.5 లక్షల ట్వీట్లు వచ్చాయి.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి, హర్యానాలో బిజెపి