దేవాలయాలపై దాడులపై కేంద్రం నివేదిక కోరాలి 

దేవాలయాలపై దాడులపై కేంద్రం నివేదిక కోరాలి 
ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలపై దాడుల అంశాన్ని రాజ్యసభ‌లో బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు లేవనెత్తారు. గత 19 నెలల్లో, హిందూ దేవాలయాలపై 140కి పైగా దాడులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. 
 
హిందూ విగ్రహాలను కూల్చివేసి, అపవిత్రం చేయడం వంటి  నేరాలు జరిగాయన్నారు. దేవాలయాలపై దాడుల కేసుల్లో నిందితులను అరెస్టు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. 
 
నిజమైన నేరస్థులను పట్టుకోకుండా, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆఖరుకి సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారని మండిపడ్డాయిరు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై  నివేదికను కోరాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను విజ్ఞప్తి చేశారు.