రామాలయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో వరంగల్ లో ఉద్రిక్తత 

అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం బిజెపి శ్రేణులు విరాళాలు సేకరించడాన్ని తప్పు బాదుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి చేసిన వాఖ్యలో వరంగల్ నగరంలో తీవ్ర ఉద్రిక్తలకు దారితీసాయి. ఆగ్రహం చేసిన బిజెపి కార్యకర్తలు ఎమ్యెల్యే ఇంటిపై దాడి చేయగా,  తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ నేతల దాడితో భగ్గుమన్న గులాబీ శ్రేణులు  వరంగల్ అర్బన్ బీజేపీ ఆఫీస్‌పై దాడికి పాల్పడ్డారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వేల కోట్ల వసూళ్లు ఎందుకని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శలతో బిజెపి శ్రేణులు ఆగ్రహం చెందారు. ధర్మారెడ్డి ఇంటిని ముట్టడించారు. వుని పేరుతో జవాబుదారీతనం లేకుండా బీజేపీ నేతలు వసూళ్లు చేస్తున్నారని ఎమ్యెల్యే విమర్శలు చేయడం పట్ల బిజెపి కార్యకర్తలు తీవ్ర నిరసన తెలిపారు.

రామమందిరం పేరుతో వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలంటూ  ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. 

బీజేపీ నేతలు రావు పద్మారెడ్డి, శ్రీధర్‌తో పాటు 56 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పోలీసులు అప్రమత్తమయ్యారు. ధర్మారెడ్డి ఇంటిని వరంగల్ సీపీ ప్రమోద్‌కుమార్ పరిశీలించారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.

ఎమ్మెల్యే ఇంటిపై దాడికి నిరసనగా సోమవారం పరకాల బంద్‌కు టీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. అటు బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. గాయపడిన కార్యకర్తలను సోమవారం రాజాసింగ్ పరామర్శించనున్నారు. ఆయన ఈరోజు హన్మకొండ వెళ్లనున్నారు. బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ బీజేపీ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది.