డా. దాసరి శ్రీనివాసులు,
మాజీ ఐఎఎస్ అధికారి, `సంచారి‘ అధ్యక్షుడు
చిలికా సరస్సు తరువాత పులికాట్ భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. 759 చదరపు కిలోమీటర్లు (293 చదరపు మైళ్ళు) వ్యాపించిన ఈ సరస్సు సగంకు పైగా 400 కిమీ వరకు ఆంధ్ర ప్రదేశ్ లో ఉండగా, మిగిలినది తమిళనాడులో వ్యాపించి ఉంది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాల వర్షం మేఘాలను ఆకర్షించే మూడు ముఖ్యమైన చిత్తడి నేలలలో ఈ సరస్సు ఒకటి. ఇది ప్రపంచంలో ప్రత్యేకమైన పక్షుల అభ్యరణ్యంగా ప్రసిద్ధి పొందింది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనకేంద్రం పక్కనే నెలకొనడం విశేషం.
పులికాట్ సరస్సుపై ఆధారపడి నెల్లూరు జిల్లాలోని 12 మండలాలకు చెంసిన 118 నివాస ప్రాంతాలలో సుమారు 60,000 మంది మత్స్యకారులు నివసిస్తున్నారు. 1980 నుండి, మార్చి – జూన్ నెలలలో చేపలు పట్టేటప్పుడు రెండు రాష్ట్రాల మత్స్యకారులు ఒకరితో ఒకరికి మధ్య ఘర్షణలు తరచూ చెలరేగుతున్నాయి. .
పులికాట్ సరస్సు ఉత్తర భాగం నుండి నీరు తగ్గుతుంది. తమిళనాడు దక్షిణ భాగంలో మత్స్య సంపదతో నీరు పేరుకుపోతుంది. పులికాట్ (తమిళనాడు) దక్షిణ భాగం చాలా లోతుగా ఉంది. పజవేరుకాడు (తమిళనాడు) వద్ద సముద్ర ద్వారం నిరంతరం తెరుచుకొని ఉండడం వల్లన ఏడాది పొడవునా నీరు అలాగే ఉంటుంది.
కాగా, ఉత్తర భాగం (ఆంధ్ర ప్రాంతం) 0.5 మీటర్ల కంటే తక్కువ లోతుతో నిస్సారంగా ఉంటుంది. ఎందుకంటె సముద్ర ద్వారం అంతటా ఇసుక మెరక ఏర్పడటం వలన పెద్ద కాలం వరకు ఎండిపోతుంది. సెప్టెంబర్-ఫిబ్రవరిలో పులికాట్ సరస్సులో నీటి మట్టం నిండినప్పుడు, ఆంధ్ర, తమిళనాడు మత్స్యకారులు చేపలు పడుతూ ఉంటారు.
తమిళ మత్స్యకారులతో తరచూ వివాదాలు
ఉత్తర భాగం (ఆంధ్ర) లో నీరు తగ్గినప్పుడు, మార్చి నుండి జూన్ వరకు దక్షిణ భాగంలో (తమిళనాడు) నీరు నిల్వ ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ సందర్భంగా పొరుగురాష్ట్రపు మత్స్యకారులు ఎక్కువ హార్స్ పవర్ బోట్ లలో వెంబడించి, ఆంధ్ర మత్స్యకారులపై దాడులు చేయడం కూడా జరుగుతున్నది.
పలు సందర్భాలలో ఆంధ్ర పత్స్యకారుల బోట్ లను ధ్వంసం చేయడం, వారి వలలను చించి వేయడంతో పాటు భౌతిక దాడులకు కూడా దిగడం ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్ర మత్స్యకారులు 15 నుండి 30 హార్స్ పవర్ బోట్ లను ఉపయోగిస్తుంటే, తమిళనాడుకు చెందిన వారు 50 వరకు హార్స్ పవర్ బోట్ లను ఉపయోగిస్తున్నారు.
పలు సందర్భాలలో ఆంధ్ర మత్స్యకారులను అపహరించి, తమ గ్రామాలలో రోజులతరబడి నిర్బంధించడం, కొన్ని సమయాలలో అక్కడి పోలీసులకు అప్పచెపి తప్పుడు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కేసులు నమోదు చేసినప్పుడు వాటికోసం అక్కడకు వెళ్లడం ఇక్కడి వారికి ఇబ్బందికరంగా మారుతున్నది.
వివాదాలకు ప్రధాన కారణాలు
- పులికాట్ సరస్సులో రెండు ప్రాంతాల మత్స్యకారుల పరిధిలోకి వచ్చే ప్రాంతాలను స్పష్టంగా వర్గీకరింపలేదు.
2 ఏపీలో. రాయదొరువు, తూపిలిపాలెం నివాస ప్రాంతాల వద్ద సముద్రలోతు (ద్వారం) తక్కువగా ఉండడంతో ఇక్కడ చేపలు పట్టలేక ఏపీ మత్స్యకారులు దూరం వెళ్ళవలసి వస్తున్నది. సరస్సు లోపలకు వెడుతున్న ఏపీ మత్స్యకారులను తమిళనాడుకు చెందినవారు వెంటాడి తరిమివేస్తూ ఉండడంతొ ఘర్షణలకు కారణం అవుతున్నది.
రాయదొరువు వద్ద సముద్రం లోతు చేయాలి
2015లో కేంద్ర జలసంఘం నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ తన మధ్యంతర నివేదికలో పులికాట్ సరస్సు రాయదొరువు వద్ద సముద్ర ద్వారం తెరవమని (లోతు చేయమని) సిఫార్స్ చేసింది. తద్వారా ఈ సమస్యలను పరిష్కరింపవచ్చని భావిస్తున్నారు.
నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో ఉన్న ఈ ప్రదేశంలో సముద్ర ద్వారం తెరవడానికి రూ 48 కోట్ల వ్యయం కాగలదని తెలుపుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్ అంచనాలను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ మేరకు నిధులను మంజూరు చేయమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
ఈ విధంగా ఇక్కడ సముద్ర ద్వారం తెరవడంతో అక్కడ గల పక్షుల అభ్యరణ్యంపై చూపే గల ప్రభావం గురించి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై కోయంబత్తూర్ లోని సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ (శకన్) సంస్థ ఒక అధ్యయనం జరిపింది. ఇక్కడ పూడిక తీయడం పులికాట్ సరస్సు పర్యావరణ వ్యవస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆ సంస్థ తమ నివేదికలో తెలిపింది.
అయితే ఇక్కడ సముద్ర పూడిక తీయడంతో తమవైపు నుండి చేపలు అన్ని ఆంధ్ర ప్రదేశ్ వైపుకు వెళ్ళిపోతాయని తమిళనాడుకు చెందిన మత్స్యకారులతో తప్పుడు అభిప్రాయం ఏర్పడి, వారు ఆందోళన చెందుతున్నట్లు తమిళనాడు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితులు
- విజయవాడలోని ఎపిసిజెడ్‌ఎ నుండి పర్యావరణ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు:నెల్లూరు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ రూ 1.35 లక్షల డిడితో సహా దరఖాస్తు చేసుకొని, విజయవాడలోని ఎపిసిజెడ్‌ఎ నుండి పర్యావరణ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు.
- డిజిపిఎస్సర్వే కోసం వైల్డ్ లైఫ్ ప్రిన్సిపాల్ సిసిఎఫ్ నుండి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు: పిసిసిఎఫ్ (డబ్ల్యుఎల్) డివిజన్ అనుమతి అవసరమయ్యే పనికి డిపిఆర్ తయారీకి డిజిపిఎస్ సర్వే తప్పనిసరి కాగలదు. అందుకోసం నెల్లూరు జిల్లా అధికారులు ఎదురు చూస్తున్నారు.
శాశ్వత పరిష్కార ప్రయత్నాలు
- 1983 నుండి ఇక్కడి మత్స్యకారులు పొరుగు రాష్ట్రంపై చెందిన వారి దాడులతో సమస్యలు ఎదుర్కొంటున్నా వారికి రక్షణ లభించే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం తగు రీతిలో చేయలేక పోతున్నది.
రెండు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు, మత్స్యకారుల ప్రతినిధులతో కలసి ఉన్నతస్థాయి చర్చలు జరిగేటట్లు చూసి, ఈ ప్రాంత మత్స్యకారులకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ లభించేటట్లు చూస్తాను.
- పులికాట్ సరస్సులో తాజాగా సర్వే జరిపించి, రెండు ప్రాంతాల మత్స్యకారుల హక్కుల గురించి నిర్దిష్టమైన ప్రామాణిక నిబంధనలు రూపొందించి, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు జరిపేటట్లు చర్యలు తీసుకొంటాము.
- రాయదొరువు వద్ద సముద్ర పూడిక తీయించడానికి అవసరమైన అనుమతులు వచ్చేటట్లు చూసి, వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన నిధులు సమీకరించి, త్వరితగతిన అక్కడ చేపలు పెట్టె అవకాశాలు మెరుగు పరచేందుకు చర్యలు తీసుకుంటాను.
- ఈ ప్రాంత మత్స్యకారుల ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడే విధంగా, వారికి అవసరమైన సదుపాయాలు ప్రభుత్వ పరంగా లభింప చేయడంపై, ఆధునిక గృహవసతి పాటు వైద్యసదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సహితం కృషి చేస్తాను.
- మత్సకారుల పిల్లలు విద్యావకాశాలు మెరుగుపడే కృషి చేస్తాను.
More Stories
రాహుల్ అజ్ఞానం వెల్లడిస్తున్న మోహన్ భగవత్పై వ్యాఖ్యలు
వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు
బంగ్లాదేశ్ లో కంగనా ‘ఎమర్జెన్సీ’ పై నిషేధం