వ్యవసాయ, కార్మిక సంస్కరణలు తక్షణ అవసరం

గోపాల్ కృష్ణ అగర్వాల్

బిజెపి జాతీయ ప్రతినిధి (ఆర్థిక వ్యవహారాలు)

బిజెపి జాతీయ ప్రతినిధి (ఆర్థిక వ్యవహారాలు) గోపాల్ కృష్ణ అగర్వాల్ కొత్తగా ఆమోదించిన లేబర్ కోడ్‌లతో కూడిన సంస్కరణ ప్రక్రియలో భాగంగా అమలులోకి వచ్చిన వ్యవసాయ చట్టాలను ప్రశంసించారు. అగర్వాల్ ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భూసేకరణకు సంబంధించిన చట్టాలలో సవరణలను వెనక్కి తీసుకురావడం భారతదేశంలో ఉత్పాదక వృద్ధికి హానికరంగా మారిన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం విముఖత చూపిస్తోందని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూ కొని ప్రధాన అంశాలు:

ఈ చట్టాలను తీసుకురావడంలో బిజెపి ఎందుకు మొండిగా ఉంది?

ఆర్థిక సంస్కరణలు ఒక విధంగా రాజకీయంగా పెను సవాళ్లతో కూడుకున్నాయి. ఎందుకంటె సంస్కరణల ప్రయోజనాలు కొంతకాలం తరువాత మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. విస్తృతమైన జనాభాకు వర్తిస్తాయి. అయితే సంస్కరణలు కొన్ని వర్గాలపై, లబ్దిదారులపై ప్రతికూల ప్రభావం వెంటనే అనుభవంలోకి వస్తుంది. 1991 నుండి పెద్ద ఆర్థిక సంస్కరణలు మనం చూడకపోవడానికి కారణం అదే.

ఆ సమయంలో కూడా, సంస్కరణలని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఆర్ధిక మార్కెట్లు, ద్వైపాక్షిక – బహుళ-పార్శ్వ వాణిజ్యానికి పరిమితం చేశారు. అప్పటి నుండి, వరుసగా ప్రభుత్వాలు వ్యవసాయం, కార్మిక రంగాలలో సంస్కరణల అవసరాన్ని గుర్తిస్తూ వచ్చాయి. కానీ వాటిని అమలు చేసే ధైర్యం ఏ ప్రభుత్వానికీ లేదు. వ్యవసాయం, కార్మిక సంస్కరణలు తక్షణ అవసరమని బిజెపి భావిస్తున్నది.

వ్యవసాయ రంగంపై మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాము కాబట్టి, వ్యవసాయ చట్టాలు రాష్ట్ర వ్యవసాయ మంత్రుల సాధికారిక కమిటీ, ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని కమిషన్, వ్యవసాయంపై పార్లమెంట్ స్థాయీసంఘం నివేదికలతో సహా అనేక సమాలోచనలలో సిఫార్సు చేశారు. వీటిని ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకు రాలేదు. కొన్నేళ్లుగా వీటిపై సమాలోచనలు జరుగుతున్నాయి.

వాస్తవం ఏమిటంటే, రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధరను పొందుతున్న కొద్ది ప్రదేశాలు పంజాబ్, హర్యానా. ఇక్కడ ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా వ్యవసాయ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది.

వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధర లభించడానికి, వనరుల పంపిణీకి మార్కెట్ సమర్ధవంతమైన యంత్రాంగమని మేము నమ్ముతున్నాము. ఆర్థికాభివృద్ధిలో రైతులు తమ వంతు పాత్ర ఏ విధంగా పోషించాలో, ప్రైవేట్ పరిశ్రమ, పెట్టుబడులు, వ్యాపారం సహితం కీలక పాత్ర పోషింప వలసి ఉంది. ఆర్థిక విధానం, వృద్ధి పటం ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల పాత్ర మధ్య సమతుల్యతను కలిగి ఉండాలి.

గత రెండు దశాబ్దాలుగా, ప్రతి వ్యవసాయ ఆర్థికవేత్త, వ్యవసాయ దారుల సంఘం  వ్యవసాయంలో ప్రైవేటు పెట్టుబడులపై చర్చించారు. ఈ చట్టాల ద్వారా మేము తొలగించిన అవరోధాల కారణంగా అది ఇప్పటి వరకు జరగలేదు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, 1955 నాటికి ఆహార వస్తువుల కొరత ఉన్నప్పుడు అవసరమైన వస్తువులపై పరిమితులు విధించారు. దేశంలో మిగులు ఆహార ధాన్యం ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటి విధానాలు కాలం చెల్లినవి కాగలవు.

కాంట్రాక్ట్ వ్యవసాయం, వ్యవసాయ ప్రాసెసింగ్ ,  విలువ పెరుగుదలకు సంబంధించిన రెండవ సమస్య. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టే ఎఫ్పిఓ  లు, ప్రైవేట్ ప్లేయర్స్ / ప్రాసెసర్ల ద్వారా సాధించగల బలమైన నిర్మాణం మనకు అవసరం కాగలదు. దాని కోసం, వ్యవసాయ ఉత్పత్తులపై వారికి ఒక ఒప్పందం అవసరం.

ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం,  ఎఫ్‌పిఓలను విలువ అదనంగా మెరుగుపరచడానికి ,  వారి ఉత్పత్తులకు మంచి ధరను పొందడం మూడవ సంస్కరణ ఉద్దేశ్యం. మూడవ భాగం ఏమిటంటే, ప్రస్తుతం భారతదేశంలో కేవలం 7,000 స్థానిక మండీలు ఉన్నాయి, వీటిలో ఎక్కువ భాగం పంజాబ్,  హర్యానాలలో కేంద్రీకృతమై ఉన్నాయి.

ఇటువంటి వాతావరణం ఇతర రాష్ట్రాల్లో లేదు. ఈ సంఖ్య 35,000-40,000 వరకు ఉండాల్సి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి, దీనికి మండి-స్ట్రక్చర్, స్టోరేజ్ / గిడ్డంగులు / కోల్డ్ స్టోరేజ్,   సప్లై చైన్ మేనేజ్‌మెంట్ కోసం పెట్టుబడి అవసరం. 

ఇది ప్రస్తుతం చెప్పడానికి ఒక ముఖ్యమైన  విషయం కాకపోవచ్చు కాని వాస్తవం ఏమిటంటే అదనపు విలువ, ఆహార ప్రాసెసింగ్ లేకుండా రైతుల ఆదాయం పెరగదు. గత 70 ఏళ్లలో ప్రభుత్వం నుండి రాని మెగా పెట్టుబడి ఈ రంగానికి  అవసరం. మాకు ప్రైవేట్ పెట్టుబడి, సంస్కరణలు, మంచి ధరలు అవసరం. రైతులు కూడా కోరుకుంటున్నది అదే కాదా?

కానీ మీరు సహాయం చేయాలనుకునే రైతులు రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు

కొంతమందికి సహీహ్తుకమైన సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  ఫీజులు,  నియంత్రణ,  నమోదు వంటి అంశాలలపై ఎపిఎంసి లకు,  ప్రైవేట్ మాండీల మధ్య సమతూకం ఉండేవిధంగా తగు సవరణలను మేము  సూచించాము. ప్రైవేట్ ఆటగాళ్లతో ఒప్పందానికి సంబంధించి న్యాయ పరిహారం అందించబడింది.

విద్యుత్ రాయితీని కొనసాగించడం,  వ్యవసాయ వ్యర్ధాలను కాల్చడంపై జరిమానాలను తొలగించడంతో పాటు కనీస మద్దతు ధరలకు హామీ ఇస్తున్నాము. ఈ సంస్కరణలు వ్యవసాయాభివృద్ధిలో విశేషంగా ఉపయోగ పడతాయి. తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మా ప్రయత్నాలు కూడా దోహదపడతాయి. 

ప్రస్తుత సంస్కరణలకు ప్రతిఘటన భారతదేశ ప్రయోజనాలకు హానికరం కాగలదు. ఉదాహరణకు భూసేకరణ చట్టాలలో మేము ప్రతిపాదించిన సవరణలు.  కానీ మొత్తం విషయం రాజకీయం చేయబడింది.

వాస్తవికత ఏమిటంటే, భారతదేశం ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా ఉండాలంటే, భూమి ఒక ప్రధాన అంశం. పరిశ్రమలకు ప్రధాన అవరోధం ధర,   భూమి లభ్యత నుండి వస్తుంది. అందుకే ఆర్థిక వ్యవస్థ యొక్క ఇంజిన్ నిరోధించబడుతుంది. వ్యవసాయ చట్టాలను నిరోధించడం వ్యవసాయ ఆదాయాలను మెరుగుపరచడంలో ఇదే విధమైన హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. రైతులు విశ్వాసం కలిగి ఉండాలని, ప్రభుత్వంతో స్నేహపూర్వక అవగాహనకు రావాలని నేను కోరుతున్నాను.