
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేంద్రమంత్రి శ్రీపాదనాయక్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శుక్రవారం చెప్పారు. గోవా ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయక్ సాధారణ ఆహారం తీసుకుంటున్నారని సీఎం వెల్లడించారు.
కేంద్ర ఆయుశ్‌శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్‌ను గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో కలిసి శుక్రవారం భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయకుడు పరామర్శించారు. ఆయనకు ప్రాణాపాయం లేదని, ప్రాణాధారాలు సాధారణ స్థితిలో పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా వైద్యులు వారికి తెలిపారు.
‘శ్రీపాద్ నాయక్‌కు ఇవాళ సాధారణ ఆహారం అందించారు. నిన్నటి నుంచి ఆయన ఆరోగ్యం కాస్త మెరుగైంది. గోవా మెడికల్ కళాశాల దవాఖాన వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు’ అని సీఎం ప్రమోద్ సావంత్ మీడియాకు తెలిపారు. కేంద్రమంత్రి నాయక్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ఆరా తీశారని సీఎం చెప్పారు.కొన్ని రోజుల్లో కేంద్రమంత్రి నాయక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని సావంత్ చెప్పారు.
గాయపడిన కేంద్రమంత్రి నాయక్ ను పరామర్శించిన వారిలో గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ శెట్ కూడా ఉన్నారు. మంత్రి నాయక్ త్వరగా కోలుకుంటున్నారని త్వరలో ఫిజియో థెరపీ సెషన్ కూడా ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్రమంత్రి నాయక్ కు టెలీఫోనులో సూచించారని మంత్రి ఓఎస్డీ సూరజ్ చెప్పారు.
కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలోని అంకోలా సమీపంలో ఈ నెల 11న ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆయన సతీమణి విజయతోపాటు వ్యక్తిగత కార్యదర్శి దీపక్ మృతి చెందారు. ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన నాయక్ గోవా మెడికల్ కళాశాల దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
More Stories
దేశ పౌరులు చట్టం తమదేనని భావించాలి
హత్యకు ముందు భారత్ పై దాడులకు నిజ్జర్ భారీ కుట్రలు
బీజేపీ మహిళా కార్యకర్తలకు ప్రధాని మోదీ పాదాభివందనం!