అఖిల‌ప్రియ‌కు 3 రోజుల పోలీసు క‌స్ట‌డీ

బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌కు సికింద్రాబాద్ కోర్టు 3 రోజుల పోలీసు క‌స్ట‌డీకి అనుమ‌తి ఇచ్చింది. బెయిల్ ఇవ్వాల‌న్న అఖిల‌ప్రియ పిటిష‌న్‌ను కోర్టు తిర‌స్కరించింది. 
 
ఆమెను ఈ కేసులో ఇంకా ద‌ర్యాప్తు చేయాల్సి ఉంద‌ని, త‌మ క‌స్టడీకి ఇవ్వాల‌ని పోలీసులు దాఖ‌లు చేసిన‌ పిటిష‌న్‌కు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అఖిల‌ప్రియ‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు కోర్టుకు తెలిపారు.
 
 సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయని కోర్టుకు పోలీసులు తెలిపారు. అఖిలప్రియ చర్యల వల్ల స్థానిక ప్రజలు అభద్రతాభావంలో ఉన్నారని తెలిపారు. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉందని పోలీసులు చెప్పారు. 
 
క‌టిక‌నేని సోద‌రుల కిడ్నాప్ కేసులో ప్ర‌స్తుతం అఖిల‌ప్రియ రిమాండ్ ఖైదీగా చంచ‌ల్‌గూడ మ‌హిళా జైల్లో ఉన్నారు. మూడు రోజుల క‌స్ట‌డీలో భాగంగా కిడ్నాప్ వ్య‌వ‌హారంపై అఖిల‌ప్రియ‌ను లోతుగా ప్ర‌శ్నించ‌నున్నారు పోలీసులు. నేటి నుంచి 13వ తేదీ వ‌ర‌కు అఖిలప్రియ పోలీసుల క‌స్ట‌డీలో ఉండ‌నుంది.