
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ స్థాయిలో ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో రైతులను ఆకర్షించడానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం కొత్త తరహా ప్రచారాన్ని ప్రారంభించారు. పుర్బా బర్ధమాన్ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రంలో రైతులను ఆకర్షించడానికి ‘క్రిషక్ సురక్ష అభియాన్’, ‘ఏక్ ముట్టి చావల్’(పిడికిలి బియ్యం)లను ఆయన ప్రారంభించారు. ‘ఏక్ ముట్టి చావల్’ అంటే రైతుల ఇళ్ల నుంచి ‘పిడికిలి బియ్యం’ సేకరించడం. అయిదుగురు రైతుల ఇళ్ల నుంచి పిడికిలి బియ్యం చొప్పున సేకరించి తన బ్యాగులో పోసుకున్నారు.
కట్వా డివిజన్‌లోని జగదానందపూర్ గ్రామంలో ‘క్రిషక్ సురక్ష అభియాన్’ కింద బీజేపీ చేపట్టిన ‘చల్ సాంగ్రాహో’(బియ్యం సేకరణ) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక రైతు ఇంట్లో భోజనం చేశారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు.
తొలుత ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించిన నరేంద్ర మోడీ మమతా బెనర్జీ ఇప్పుడు వాస్తవాలు గ్రహించి, తమ పార్టీ రాష్ట్రంలో రైతుల మద్దతు కోల్పోతుందన్న భయంతో పీఎం కిసాన్ యోజనను అమలు చేయడానికి అంగీకారం తెలిపిందని నడ్డా ఎద్దేవా చేసారు.
రాష్ట్రంలో దాదాపు 70వేల రైతు కుటుంబాలు సీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలు పొందలేకపోయారని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు ఆ పథకం అమలుకు అనుమతి ఇవ్వమని కోరుతూ సీఎం మమత ప్రధానికి లేఖలు రాస్తున్నారని ధ్వజమెత్తారు.
అసెంబ్లీ ఎన్నికల లోగా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి 40 వేల గ్రామాలలో జరుపతలపెట్టిన `క్రిషాక్ సురోక్ఖా గ్రామ సభ’ (రైతుల భద్రతా గ్రామా సభ)ను ఆయన జగదానందపూర్ గ్రామంలో అటువంటి సభను జరిపి ప్రారంభించారు.
More Stories
వహీదా రెహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
భారత్ కు బాసటగా శ్రీలంక.. ప్రధాని ట్రూడోపై మండిపాటు
కెనడాలో రెచ్చిపోతున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు