రామతీర్ధంపై దర్యాప్తుకు క్రైస్తవ అధికారా!

రామతీర్ధంపై దర్యాప్తుకు క్రైస్తవ అధికారా!
రామతీర్థం ఘటనపై దర్యాప్తును సీబీసీఐడీ అధికారి సునీల్ కుమార్‌కు అప్పగించడంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. దర్యాప్తును ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే సునీల్ కుమార్‌కు అప్పగించడం వల్ల న్యాయం జరగదని స్పష్టం చేశారు. 
 
గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ  హైకోర్టుతో చీవాట్లు తిన్న ఆయనకు ఈదర్యాప్తు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. పైగా,  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి,  హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీబీసీఐడీ దర్యాప్తు అధికారి సునీల్ కుమార్ అందరూ క్రైస్తవులు అని గుర్తు చేశారు. 
 
హిందూ దేవాలయాలపై దాడుల కేసును ఆయనకు  ఎలా అప్పగిస్తారని నిలదీశారు. పారదర్శకంగా దర్యాప్తు జరగాలని భావించినట్లయితే  క్రైస్తవ, రెడ్డి సామాజిక వర్గానికి చెందని అధికారిని దర్యాప్తు కోసం నియమించాలని స్పష్టం చేశారు. దర్యాప్తును నిష్పక్షపాతంగా విచారించాలనుకుంటే మంచి అధికారిని ప్రత్యేక దర్యాప్తు కోసం నియమించాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.