
కరోనా మహమ్మారి ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంది. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కరోనా వ్యాక్సిన్‌పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీజేపీ ఇచ్చే వ్యాక్సిన్‌పై తనకు భరోసా లేదని, దానిని వేయించుకోనని అఖిలేష్ వ్యాఖ్యానించారు. ఇప్పుడివి సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి. దీంతో అఖిలేష్ తన తన వ్యాఖ్యల అంతరార్థాన్ని చెప్పుకోవలసి వచ్చింది.
అంతకుముందు అఖిలేష్… ‘ప్రస్తుతానికి నేను టీకా వేయించుకోను. బీజేపీ ఇచ్చే వ్యాక్సిన్‌ను ఎలా నమ్మగలను? మా ప్రభుత్వం టీకా తయారు చేసివుంటే వేసుకునేవాడిని. తాము బీజేపీ టీకా వేయించుకోము’ అని వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యాలపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో అఖిలేష్ వీటికి సమాధానం ఇచ్చుకున్నారు. కరోనా టీకాలు వేయడమనేది చాలా సున్నితమైన వ్యవహారం. దీనిని బీజేపీ అద్భుతమైన ఈవెంట్‌లా భావించకూడదు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న అనంతరమే టీకాలు వేయడం ప్రారంభించాలని సూచించారు.
ఇది జీవితానికి సంబంధించిన విషయం. అందుకే ఎవరికీ ఎటువంటి హాని కలుగకుండా చూసుకోవాలి. పేదలకు టీకా వేసే సమయాన్ని ఖచ్చితంగా తెలియజేయాలి. తమకు శాస్త్రవేత్తలపై నమ్మకం ఉందని, అయితే ఈ విషయంలో బీజేపీ హడావుడి చేయడం తగదన్నారు. వ్యాక్సిన్ అందరికీ వేసేందుకు బీజేపీ చేస్తున్న ఏర్పాట్లపై తనకు భరోసా లేదని అఖిలేష్ పేర్కొన్నారు.
More Stories
ఎనిమిదేళ్లలో రూ.2.53 లక్షల కోట్ల రక్షణ సామగ్రి
107 మంది ఎమ్మెల్యేలు, ఎంపిలపై ద్వేషపూరిత ప్రసంగాల కేసులు
న్యాయవ్యవస్ధపై చేసిన వ్యాఖ్యలకు అశోక్ గెహ్లాట్ క్షమాపణ