బలవంతపు మతమార్పిడులకు కళ్లెం వేసేందుకు మత స్వేచ్ఛ బిల్లు-2020ని మధ్యప్రదేశ్ మంత్రివర్గం శనివారం ఆమోదించింది. ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి వివాహం ద్వారా మతమార్పిడి, లేదా ఇతర తప్పుడు విధానాల ద్వారా మతమార్పిడికి పాల్పడినట్టు తేలితే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా పడుతుంది.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశపై ధర్మ స్వతంత్ర (మత స్వేచ్ఛ) బిల్లు-2020ను సమావేశంలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతారు. కొత్త బిల్లుతో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మైనర్, మహిళలను బలవంతంగా మతం మార్చితే కనీసం రూ.50వేల జరిమానాతో పాటు పది సంవత్సరాల వరకు జైలు శిక్షపడనుంది.
కొత్త బిల్లు ప్రకారం ఒకరిపై మత మార్పిడి బలవంతం చేస్తే 1-5 సంవత్సరాల జైలు శిక్ష, రూ25వేల జరిమానా విధించనున్నట్లు హోమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ, అన్ని మతాలకు, కులాలకు చెందినది ఇందులో ఎలాంటి వివక్ష లేదని సీఎం అశోక్ చౌహాన్ పేర్కొన్నారు.
మత స్వేచ్ఛ చట్టం-1968 స్థానే ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదానంతరం అమల్లోకి వస్తుందని చెప్పారు. మతం మార్చుకోవాలని కోరుకునే వారు జిల్లా యంత్రాంగానికి రెండు నెలలు ముందుగానే దరఖాస్తు చేసుకునే ప్రొవిజన్ కూడా ఇందులో చేర్చనున్నట్టు మిశ్రా తెలిపారు. గత నెలలో యూపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేసిన మూడో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.
More Stories
భారత్ బలం అద్భుతమైన ఏకీకృత స్ఫూర్తిలోనే ఉంది
రాహుల్ గాంధీపై గౌహతిలో కేసు
భారత మహిళల అండర్-19 జట్టు తొలి విజయం