పోలీస్ నిర్బంధంలో ప్రియాంక గాంధీ 

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  ప్రియాంకా గాంధీతో పటు పలువురు కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ సంతకాలు సేకరణ చేసిన పాత్రలను రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కు సమర్పించడం కోసం ప్రదర్శనగా వెడుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. 
 
అరెస్ట్ అయినా వారిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా  ప్రభూతులు ఉన్నారు. అయితే ఒక ప్రతినిధివర్గం రాహుల్ గాంధీ నాయకత్వంలో రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం సమర్పించారు. మూడు కొత్త రైతు చట్టాలను రద్దు చేయాలని వారు కోరారు. 
 
పార్లమెంట్ ఉభయసభలలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇతర సీనియర్ నాయకులు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. ప్రియాంక, ఇతర నేతలను మందిర్‌మార్గ్ పోలీసు స్టేష‌న్‌కు తీసుకువెళ్లారు. రెండు కోట్ల మంది రైతులు సంత‌కాలు చేసిన లేఖ‌ను రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ నేతలు సమర్పించినట్లు రాహుల్ గాంధీ చెప్పారు.
 
 రైతుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకే ఈ ర్యాలీని చేప‌ట్టిన‌ట్లు ఆమె చెప్పారు. మ‌నం ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామ‌ని, ఎన్నికైన ఎంపీలు ఉన్నార‌ని, రాష్ట్ర‌ప‌తిని క‌లిసే హ‌క్కు అంద‌రికీ ఉంద‌ని, ఆయ‌న్ను క‌లిసే అవ‌కాశం ఇవ్వాల‌ని ప్రియాంకా కోరారు. నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతుల వాదనలను ప్రధాని వినాలని రాహుల్ కోరారు.