గెలిచిన కార్పొరేటర్లతో గెజిట్‌‌‌‌ విడుదల చెయ్యరే!

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లతో గెజిట్‌‌‌‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌‌‌‌ఈసీ) ఎందుకు విడుదల చేయట్లేదని బీజేపీ ప్రశ్నించింది. ఇందుకు కారణమేంటో వెల్లడించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ పార్థసారథిని బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ఎన్‌‌‌‌వీఎస్‌‌‌‌ఎస్ ప్రభాకర్, పార్టీ లీగల్ సెల్ నేత ఆంటోనిరెడ్డి కలిసి వినతిపత్రం అందించారు.

గెజిట్ విడుదల చేశాక జీహెచ్‌‌‌‌ఎంసీ పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయాలని, తర్వాత మేయర్ ఎన్నిక జరగాలని, ఈ విషయాల్లో ఈసీ ఆలస్యం చేస్తోందని రాంచంద్రారెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే గెజిట్ విడుదల చేయాలని చట్టం చెబుతోందని పేర్కొన్నారు. 24 గంటల్లో నోటిఫికేషన్ ఇవ్వకపోతే గెలిచిన అభ్యర్థులతో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపడతామని తెలిపారు. ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ఫిబ్రవరి 10 వరకు ఉన్నా ముందే ఎన్నికలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. 

ఎన్నికల్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు మెజార్టీ రానందునే ఈసీ కాలయాపన చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఎన్‌‌‌‌వీఎస్‌‌‌‌ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. త్వరలో గవర్నర్‌‌‌‌ను కలిసి ఈ విషయాలు వివరిస్తామని చెప్పారు.

కాగా, గ్రేటర్ ఎన్నికలు పూర్తయి రిజల్ట్ ప్రకటించినా ఎస్‌‌‌‌ఈసీ గెజిట్ విడుదల చేయ కపోవడం, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు అనుకూలంగా వ్యవరిస్తూ కొత్త పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయకపోవడంపై బీజేపీ నేడు హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిపై పిటిషన్ వేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.