సాగరమాల పధకంలో భాగంగా పలు దేశీయ జలమార్గాలతో పాటు ఆరు అంతర్జాతీయ జలమార్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ప్రయాణ సౌకర్యం ,సరుకు రవాణా మార్గాల అభివృద్ధి చేయడానికి కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గపు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
దేశానికి 7,500 కి.మీ. గల తీరప్రాంతంలోని అనువైన పోర్టులను అభివృద్ధిపరచి వాటిని సరుకు, ప్రజా రవాణాకు వినియోగించుకోవడానికి కేంద్రం సంకల్పించింది. హజారియా, ఓఖా, సోమ్నాథ్ దేవాలయం, డిఐయు, పిఐపిఏవిఏవి, దహేజ్, మంబై లేదా జెఎన్పిటి, జాంనగర్, కొచ్చి, ఘోఘా, గోవా, ముంద్రా వంటి దేశీయ, 6 అంతర్జాతీయ జలమార్గాల్ని అందుకోసం మంత్రిత్వశాఖ గుర్తించింది.
వీటితోపాటు బంగ్లాదేశ్లోని చట్టోగ్రాం, తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్ల్, మడగాస్కర్, శ్రీలంకలోని జాఫ్నాలను భారత ప్రధాన తీరప్రాంతంలోని పోర్టు పట్టణాలతో కలిపి దేశీయ , అంతర్జాతీయ జలమార్గపు సేవలను ప్రారంభించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది.
ఇందుకుగాను సాగరమాల అభివృద్ధి కంపెనీ లిమిటెడ్(ఎస్డిసిఎల్) ఈ కార్యక్రమం క్రింద దేశవ్యాప్తంగా ఆర్వో -ఆర్వో , ఆర్వో-పాక్స్, ప్రజా రవాణా సేవలకు ఆయా మార్గాల్లో అవసరమైన సహకారాన్ని అందిస్తుంది.
ఈ కార్యక్రమం క్రింద కేంద్ర మంత్రిత్వ శాఖ హజారియా, ఘోఘా మధ్యన రోపాక్స్ , ప్రజారవాణా సేవలను ఇటీవల విజయవంతంగా ప్రారంభించి అమలుపరుస్తున్నది. ఇందువలన ఘోఘా,హజారియాల మధ్యన గల 370 కి.మీ దూరాన్ని 90 కి.మీ 10 నుంచి 12 గంటల ప్రయాణాన్ని5గంటలకు తగ్గించింది.
ఈ జల మార్గం వినియోగం వలన రోజుకు సుమారు 9000 లీ. ఇంధనం ఆదా అవుతుంది. ఈ ఉత్సాహంతో కేంద్ర పోర్టులు, షిప్పింగ్ , జలమార్గపు మంత్రిత్వ శాఖ దేశ తీరప్రాంతం వెంట ఇటువంటి మరిన్ని సేవలను సుస్థిరంగా అందించడానికి ప్రయత్నం చేస్తుంది.
దీనివలన జలమార్గాన్ని అభివృద్ధిచేయడం వలన రోజువారీ ప్రయాణీకులకు, పర్యాటకులకు ,సరుకు రవాణాతోపాటు రైలు , రోడ్డు మార్గాలతోనే కాక పర్యావరణహితమైన మరో ప్రయాణమార్గాన్ని అందించినట్లవుతుంది.
More Stories
గణేశ్ మండపంపై రాళ్లు.. సూరత్లో ఉద్రిక్తత
దేశంలో మంకీపాక్స్ తొలి కేసు?.. భయం వద్దన్న కేంద్రం
ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు గ్రామస్థులకే శిక్షణ