హర్యానాలో జరగనున్నఖెలో ఇండియా యువజన క్రీడలు – 2021 లో భాగంగా నాలుగు స్వదేశీ ఆటలను చేర్చడానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆ ఆటల్లో – గట్కా, కలరిపాయట్టు, థాంగ్-టా తోపాటు మల్లఖంబ ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
“భారతదేశానికి గొప్ప స్వదేశీ క్రీడల వారసత్వం ఉంది, ఈ ఆటలను సంరక్షించి, ప్రోత్సహించడంతో పాటు ప్రాచుర్యం కల్పించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతనిస్తున్నది. ఈ ఆటల క్రీడాకారులు పోటీపడి, తమ ప్రతిభను ప్రదర్శించడానికి, ఖేలో ఇండియా క్రీడల కంటే మంచి వేదిక మరొకటి లేదు” అని పేర్కొన్నారు.
ఈ ఆటలకు భారీ ప్రజాదరణ ఉంది. ఈ ఆటలను “స్టార్ స్పోర్ట్స్” ఛానెల్” దేశవ్యాప్తంగా ప్రసారం చేస్తుంది. కాబట్టి 2021 ల ఓ నిర్వహించే ఖేలో భారత యువజన క్రీడోత్సవాల్లో యోగాసనాలతో పాటు ఈ నాలుగు విభాగాల చేరికతో, క్రీడా ప్రియులు , దేశంలోని యువత కు సరైన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుందని, తనకు నమ్మకం ఉందని క్రీడా మంత్రి తెలిపారు.
భవిష్యత్తులో ఖేలో ఇండియా క్రీడోత్సవాల్లో మరిన్ని దేశీయ క్రీడలను జోడించగలుగుతామని చెప్పారు. ఎంపిక చేసిన ఈ నాలుగు ఆటలు దేశంలోని వివిధ ప్రాంతాలను సూచిస్తాయి. కేరళకు చెందిన కలరిపాయట్టు క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.వీరిలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్వాల్ ఒకరు.
అదే సమయంలో, మల్లఖంబ, భారతదేశం అంతటా ప్రసిద్ది చెందింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ క్రీడ చాలా ప్రాచుర్యం పొందింది. గాట్కా పంజాబ్ రాష్ట్రానికి చెందిన క్రీడ. నిహాంగ్ సిక్కు వారియర్స్ ఈ సాంప్రదాయ పోరాట శైలిని ఆత్మరక్షణగా, క్రీడగా ఉపయోగిస్తారు.
థాంగ్-టా, మణిపూర్ కి చెందిన యుద్ధ క్రీడ. ఇటీవలి దశాబ్దాలలో ఇది చాలా ఉపేక్షకు గురైంది. అయితే ఖేలో ఇండియా యువజన క్రీడలు – 2021 సహాయంతో ఈ క్రీడకు మళ్లీ జాతీయ గుర్తింపు లభిస్తుంది.
భారత జాతీయ గాట్కా అసోసియేషన్ అధ్యక్షుడు, హర్జీత్ సింగ్ గ్రెవాల్ మాట్లాడుతూ, “ఖేలో ఇండియా యువజన క్రీడల్లో భారత పురాతన యుద్ధ కళ గట్కాను క్రీడా మంత్రిత్వ శాఖ చేర్చినందుకు మాకు సంతోషం. ఖేలో ఇండియా ఈ ప్రయత్నం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన, మరచిపోయిన భారతీయ సాంప్రదాయ యుద్ధ కళలను ప్రోత్సహించడానికి, పునరుద్ధరించడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
అదనంగా, దేశవిదేశాల్లో అవగాహన కల్పించడానికి భారత జాతీయ గాట్కా అసోసియేషన్ ప్రయత్నాలకు, ఈ చర్య, ప్రోత్సాహాన్ని ఇస్తుందిని పేర్కొన్నారు. ఈ పోటీల ద్వారా, ఈ క్రీడ బాగా ప్రాచుర్యం పొందుతుందని, థాంగ్-టా సమాఖ్య కూడా ధృవీకరించింది.
భారత థాంగ్-టా సమాఖ్య కార్యదర్శి వినోద్ శర్మ మాట్లాడుతూ, “ఈ పోటీలో వివిధ రాష్ట్రాల నుండి 400 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటారు. ఇది జాతీయంగా, అంతర్జాతీయంగా మరింత గుర్తింపు పొందటానికి మాకు సహాయపడుతుంది,” అని పేర్కొన్నారు.
More Stories
జమిలి ఎన్నికలకు పట్టుదలతో మోదీ ప్రభుత్వం
వైద్యులందరికీ ప్రత్యేక ఐడీలు
హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు