రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ కార్యకర్త శ్రీ గోవింద వైద్యజీ అస్తమయం

రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ కార్యకర్త శ్రీ మాధవ గోవింద వైద్య ఈ రోజు పరమపదించారు. వారి వయసు 97 సంవత్సరాలు. ‘తరుణ్ భారత్’ పత్రిక సంపాదకులుగా వ్యవహరించైన మాధవ గోవింద వైద్య రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘానికి ఇప్పటిదాకా సర్ సంఘచాలకులుగా వ్యవహరించిన మొత్తం ఆరుగురితో కలిసి పనిచేశారు. రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ గా బాధ్యత నిర్వర్తించారు.

స్వర్గీయ మాధవ గోవింద వైద్య గారి ఇరువురు కుమారులలో ఒకరు శ్రీ మన్మోహన్ జీ వైద్య ఆర్.ఎస్.ఎస్. సహ సర్ కార్యవాహగా కొనసాగుతున్నారు. మరొకరు కుమారులు శ్రీ శ్రీరాం వైద్య ఆర్.ఎస్.ఎస్. పూర్తి సమయ కార్యకర్త (ప్రచారక్) గా విదేశాలలో సంఘ కార్యకలాపాల విస్తరణ కార్యం లక్ష్యంగా విశ్వవిభాగ్ తరఫున పని చేస్తున్నారు.

తొమ్మిది దశాబ్దాల సంఘ ప్రస్థానానికి శ్రీ గోవింద వైద్య సాక్షిగా నిలిచారు.

 

Source: VSK Telangana