మాధవ్ గోవింద వైద్య కన్నుమూత

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జ్యేష్ఠ కార్యకర్త, సిద్ధాంత కర్త మాధవ్ గోవింద వైద్య శనివారం కన్నుమూశారు. నాగపూర్‌లోని స్పందన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3:30 గం.లకు తుదిశ్వాస విడిచారని ఆయన మనుమడు విష్ణువైద్య వెల్లడించారు. 
 
 కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాగ్‌పూర్‌లోని స్పందనా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను నాగ్‌పూర్‌లోని అంబజరీ ఘాట్‌లో ఆదివారం ఉదయం 9 గంటలకు 30 నిమిషాలకు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు ఆర్‌ఎస్‌ఎస్‌ సంయుక్త కార్యదర్శి  డాక్టర్‌ మన్‌మోహన్‌ వైద్య తెలిపారు. 

శుక్రవారం ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొట్ట మొదటి అధికార ప్రతినిధిగా ఈయన బాధ్యతలు నిర్వర్తించారు. 
 
తొమ్మిది దశాబ్దాలుగా ఆర్ ఎస్ ఎస్ తో అనుబంధం ఉన్న ఆయన ద్వితీయ సర్ సంఘ్ చాలక్ గురూజీతో పాటు మొత్తం ఆరుగురు సర్ సంఘ్ చాలక లతో కలసి పనిచేశారు. తుది శ్వాస వరకూ సిద్ధాంతం కోసం పోరాడుతూనే ఉన్నారు. చాలా మంది పాత్రికేయులకు ఆదర్శప్రాయులు.
 
ఈయన మృతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. ‘‘సంఘ్ జ్యేష్ఠ కార్యకర్త, సిద్ధాంతకర్త మాధవ్ గోవింద్ వైద్య వెళ్లిపోయారు. నా వినయ పూర్వక నివాళి అర్పిస్తున్నా” అని తెలిపారు.