ఉగ్రవాదులను తీసుకెడుతున్న కాంగ్రెస్ నేత అరెస్ట్ 

ఉగ్రవాదులను తీసుకెడుతున్న కాంగ్రెస్ నేత అరెస్ట్ 
ఉగ్రవాదులను తరలిస్తున్న కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూకశ్మీరులో కాంగ్రెస్ నేత గౌహార్ అహ్మద్ వని దక్షిణ కశ్మీరులోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులను వెంట తీసుకువెళుతుండగా జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు.
డిసెంబరు 7వతేదీన షోపియాన్ జిల్లాల్లో కారులో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు గౌహార్ అహ్మద్ వని ఉగ్రవాదులను తీసుకువెళుతుండగా భద్రతాదళాలు ఆపగా అతను కారు నుంచి దూకి పారిపోతుండగా పట్టుకున్నారు. గౌహార్ డిసెంబరు 7వతేదీన బాబా ఖాదర్ రాంపురా చౌక్ వద్ద కారులో ఉగ్రవాదులను తీసుకువెళుతుండగా ఆర్మీ అడ్డగించగా, ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయారు.
పుల్వామా నుంచి షోపియాన్ వరకు బాబాఖాదర్ రాంపురా చౌక్ మీదుగా ఉగ్రవాదులను తీసుకువెళుతూ గౌహర్ పోలీసులకు చిక్కాడు. గౌహార్ కు ఉగ్రవాదులతో పాటు ఉగ్రవాద పోలీసు డీఎస్పీ దవేందర్ సింగ్ తోనూ సంబంధాలున్నాయని పోలీసులు చెప్పారు.
గతంలో ఇతన్ని పోలీసులు అరెస్టు చేశారు. గౌహార్ తీసుకువెళుతున్న ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూపునకు చెదిన వారని, వారిని వాంటెడ్ ఉగ్రవాదులుగా గుర్తించామని పోలీసులు చెప్పారు.