
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రికి కేసీఆర్ లేఖ రాశారు.
గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని కేసీఆర్ కొనియాడారు. ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేదని, అలాగే అవి వలస పాలనకు గుర్తుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు.
‘‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్ఠకు, పునరుజ్జీవనానికి, పటిష్టమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలి’’ అని కేసీఆర్ ఆకాంక్షించారు.
More Stories
6 నెలలు దాటినా అమలుకాని ఎంఎస్ఎంఈ విధానం
కాంగ్రెస్ నిధులతోనే దారుస్సలాంలో వక్ఫ్ సభ!
కాంగ్రెస్, బిఆర్ఎస్ నక్సలైట్ల వారసులు