రైతుల గురించి కేసీఆర్ మాట్లాడడం ఈ దశాబ్ధపు జోక్  

రైతుల గురించి కేసీఆర్ మాట్లాడడం ఈ దశాబ్ధపు జోక్ అని నిజామాబాదు ఎంపీ, బిజెపి నేత ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. ధర్నా చౌక్ ఎత్తేసిన కేసీఆర్,  ఇప్పుడు ధర్నా చేస్తాడా అని ప్రశ్నించారు. 

రైతు చట్టంపై ముఖ్యమంత్రి, మంత్రులతో చర్చకు తాను సిద్దమని సవాల్ చేశారు. మొగ పుట్టుక పుట్టినోడు ఎవడైన కొత్త వ్యవసాయ చట్టాలపై బహిరంగ చర్చకు రావాలని దుయ్యబట్టారు. చర్చలో కూడా తాను ఒక్కడినే ఉంటానని స్పష్టం చేశారు. ఎలా నష్టం జరుగుతుందో చెప్పాలని నిలదీశారు. 

ఈ చట్టంతో రైతులకు ఎలా లాభం జరుగుతుందో చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయల కమీషన్లు పోతున్నాయనే రైతు చట్టాలపై ప్రాంతీయ పార్టీల ఏడుస్తున్నాయని మండిపడ్డారు. దళారీలు మాత్రమే ఉద్యమం చేస్తున్నారని చెబుతూ ఢిల్లీ ఉద్యమంలో రైతులెవరూ లేరని విమర్శించారు.

తెలంగాణ రైతులు సీఎం కేసీఆర్ ను త్వరలో బట్టలూడదీసి కొడ్తారని అరవింద్ హెచ్చరించారు. ఉద్యమం అంటే కేసీఆర్ కు చూపిస్తామని చెప్పారు. గడాఫీకి పట్టిన గతే కేసీఆర్ కు పడ్తోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్  తెలంగాణలో ఫేక్ ఉద్యమం నడుపుతోందని ధ్వజమెత్తారు. 

గ్రేటర్ ఎన్నికల్లో దిమ్మతిరిగింది, కేటీఆర్ కు సరిపోలేదేమో? అని నిలదీసిరు. మక్క కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదో ప్రభుత్వం చెప్పాలని సవాల్ చేశారు.  సన్నాలను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయటం లేదని ప్రశ్నించారు. 

దగ్గు, జలుబు వస్తే కేసీఆర్ కార్పోరేట్ ఆసుపత్రైన యశోదాకే ఎందుకు వెళ్తున్నాడని అరవింద్ ధ్వజమెత్తారు. కేటీఆర్, కవితలు కమిషన్ ఇవ్వకపోవటం వలనే ఎమ్మెల్యే, మంత్రులు కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రైతు నిర్వచనాన్నే మార్చివేశారని అరవింద్ ఎద్దేవా చేశారు. దున్నే వాడిదే భూమి అనే నినాదాన్ని  పాస్ పుస్తకం ఉన్నోడిదే భూమి అనే పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చాడని దుయ్యబట్టారు.