అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ.1400 కోట్లు అవసరమని, ప్రస్తుతం రోజుకు రూ.కోటి దాకా ట్రస్టు ఖాతాకు జమవుతోందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ముఖ్యులు, పెజావర పీఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ స్వామి వెల్లడించారు.
వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు దేశంలోని ప్రతి ఇంటి నుంచి నిధుల సేకరణ జరుగుతుందని ఆయన తెలిపారు. విశ్వహిందూ పరిషత్ కేటాయించిన కార్యకర్తలతో మాత్రమే సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని స్వామిజి స్పష్టం చేశారు.
కనిష్ఠంగా పది రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఒక ఇంటికి కూపన్ ఇస్తామని, ఆ మొత్తాన్ని ట్రస్టు ఖాతాకు నేరుగా జమ చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు.
కాగా, విశ్వేశతీర్థస్వామిజీ తొలి వర్ధంతి ఈ నెల 17న బెంగళూరులోని పూర్ణ ప్రజ్ఞ విద్యాపీఠంలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

More Stories
ఎర్రకోటపై తొలిసారి ప్రతిధ్వనించిన వందేమాతర గీతం
`ఉగ్రవాద లింకులు’ ఆరోపణలపై బెంగాల్ యువకుడి అరెస్ట్
జనాభా లెక్కల సేకరణలో 40 ప్రశ్నలు.. మొదటిసారి కులగణన