హిందువులపై దాడికి చూస్తున్న బంగ్లా ఉగ్రవాది అరెస్ట్ 

తమ దేశంలో హిందువులపై దాడులు జరపాలని,, కాశ్మీర్ లోయలో `పోరాటం’ జరపాలని సిద్ధపడిన ఒక బాంగ్లాదేశ్ జాతీయుడు సింగపూర్ లో అరెస్ట్ అయ్యాడు. సింగపూర్ ప్రభుత్వం చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలలో భాగంగా అరెస్ట్ చేసిన 37 మందిలో అతను ఒకడు. వీరిలో 14 మంది సింగపూర్ పౌరులు  కాగా, మిగిలిన వారంతా విదేశీయులు. 
 
విదేశీయులలో బంగ్లాదేశీ పౌరులు ఎక్కువగా ఉన్నారని సింగపూర్ హోమ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సింగపూర్ పౌరులలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరిలో చాలామంది ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రవాద దాడులకు స్పందిస్తూ సోషల్ మీడియా పోస్ట్ లు చేయడం ద్వారా మతపర ఉద్రిక్తలు, హింసకు రెచ్చగొట్టే కృషి చేసిన వారు. 
 
వీరిలో బాంగ్లాదేశ్ పౌరుడైన అహ్మద్ ఫసల్ (26) నిర్మాణ రంగంలో పనిచేయడం కోసం 2017లో సింగపూర్ కు వచ్చాడు. అంతర్గత భద్రత చట్టం క్రింద ఉగ్రవాద సంబంధ చర్యలకు పాల్పడుతున్నందుకు నవంబర్ 2 న అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్ ఆన్ లైన్ ప్రచారానికి ప్రభావితమై 2018లో ఉగ్రవాదిగా మారాడని అధికారులు భావిస్తున్నారు. 
 
సిరియాలో ఇస్లామిక్ రాజ్యం నెలకొల్పడానికి పోరాడుతున్న ఉగ్రవాద సంస్థ హయత్ తాహ్రిర్ ఆల్-షామ్ తో 2019 మధ్యలో సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంస్థకోసం సిరియాలో పనిచేస్తున్న ఒక సంస్థకు విరాళాలు కూడా సమకూర్చిన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 
 
బాంగ్లాదేశ్ లో హిందువులపై దాడి జరపడం కోసం అంటూ కొన్ని కత్తులు కూడా సమకూర్చుకున్నట్లు అధికారుల మధ్య అంగీకరించారు. పైగా, కాశ్మీర్ కు వెళ్లి ఇస్లాం శత్రువులపై పోరాటడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పాడు. ఆల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలకు కూడా మద్దతుదారుడిగా ఉన్నాడు . 
 
ఉగ్రవాద వ్యతిరేక చర్యలలో భాగంగా 16 మంది విదేశీయులను సింగపూర్ వెనుకకు పంపగా వారిలో 15 మంది బంగ్లాదేశీయులే కావడం గమనార్హం. మరోవ్యక్తి బాంగ్లాదేశ్ కు చెందినవాడు.