జాన‌కి సేతు జాతికి అంకితం 

ఉత్తరాఖండ్‌ తెహ్రీ గర్హ్వాల్లోని మునికి రెటి ప్రాంతంలో గంగాన‌దిపై నిర్మించిన జాన‌కి వంతెన‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావ‌త్ శుక్రవారం సాయంత్రం జాతికి అంకితం చేశారు. 346 మీటర్ల పొడవైన ఈ పాదచారుల వేలాడే వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.48.85 కోట్లు వెచ్చించింది.
మూడు వరుసలో ఈ వంతెనను నిర్మించారు. ఇక్కడ వంతెన లేకపోవడంతో దశాబ్దాలుగా భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం తెలిపారు. త్వరలో పౌరిలోని సిన్‌తాలి-బీన్‌ నదుల మధ్య ఓ వంతెన నిర్మాణాన్ని పార్రంభించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
బజరంగ్‌ సేతుగా దీనికి నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ని పూర్తిగా ప్రత్యేక గాజుతో కళాత్మకంగా నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.  ఆయన వెంట శాసనసభ స్పీకర్‌ ప్రేమ్‌చంద్‌ అగర్వాల్‌, రిషికేశ్‌ మేయర్‌ అనితా మమ్గేయిన్‌ తదితరులున్నారు.