బిహార్ సీఎంగా 7వ సారి నితీష్  ప్రమాణ స్వీకారం

బిహార్ సీఎంగా 7వ సారి నితీష్  ప్రమాణ స్వీకారం

బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ముఖ్యమంత్రిగా రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. 

కాగా, బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌కు ఇది వరుసగా నాలుగోసారి. మొత్తంగా ఇది ఏడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 15 ఏళ్లుగా బిహార్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్న నితీష్, తాజాగా జరిగిన ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమి విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 

జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ముందుగా చెప్పినట్లుగానే నితీష్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుని మాట నిలబెట్టుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,  మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌లు .. నితీశ్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌ర‌య్యారు.

బీజేపీకి చెందిన రేణు దేవి, థార్ కిషోర్‌లు బిహార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో బిహార్ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా థార్ కిషోర్, శాసనసభాపక్ష ఉప నేతగా రేణు దేవిని ఇప్పటికే ఎన్నుకన్నారు. 

విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చైదరి, మేవా లాల్ చౌదరి, సంతోష్ కుమార్ సుమన్, ముకేష్ సాన్హి, మంగళ్ పాండే, అమరేంద్ర ప్రతాప్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.   బీహార్ అసెంబ్లీ స్పీక‌ర్‌గా బిజెపి నేత నంద‌కిశోర్ యాద‌వ్ నియ‌మితుల‌య్యారు.