వ్యాక్సిన్ కన్నా ముందే హెర్డ్‌ ఇమ్యూనిటీ

కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావడానికి ముందే దేశ ప్రజలంతా హెర్డ్‌ ఇమ్యూనిటీ ని పొందే అవకాశముందని తాజాగా ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా ప్రకటించారు.
 
 ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు పలు కంపెనీలు టీకా లను కనుగొని వాటి చివరి దశ ప్రయోగాలను చేపడుతోన్నాయి. చివరి దశ ప్రయోగాలు జరుపుకుంటున్న పలు కంపెనీల టీకాలకు ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఆమోదం లభించే అవకాశముంది.
 
ముఖ్యంగా అధికా జనాభా ఉన్న మన దేశంలో ప్రతీ ఒక్కరికీ టీకా ను అందించడం ప్రభుత్వానికి సవాలుతో కూడుకున్న పని. టీకా పంపిణీకి సంబంధించి కేంద్రం ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
 
ఇటువంటి సమయంలో,  ” మేము మంచి రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నామనే దశకు చేరుకోవచ్చు. అప్పుడు వ్యాక్సిన్ ప్రయోజనం ఉండదు” అని గులేరియా వెల్లడించారు. 
 
అయితే ఇక్కొడొక సమస్య ఉన్నట్లు తెలిపారు. వైరస్‌ మార్పులు చెందితే రీ ఇన్‌ఫెక్షన్‌ ను నివారించడానికి టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వైరస్‌ స్పందించే తీరుపై తాము అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దాని ఆధారంగా ఎంత తరచుగా టీకా తీసుకోవాల్సి ఉంటుందో అర్థమవుతుందని వివరించారు.