బీహార్, దుబ్బాక, ఎంపీల్లో ముందంజలో బిజెపి 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలోని దుబ్బాకతో పాటు మధ్య ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఇతర చోట్ల జరిగిన ఉపఎన్నికలలో బీజేపీ, దాని మిత్ర పక్షాలు ముందంజలో  విజయం వైపుకు దూసుకు పోతున్నాయి. 
 
దుబ్బాకలో ఐదవ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి బిజెపి అభ్యర్హ్ది రఘునందన్ రావు 3,020 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.బిజేపికి 16,517 ఓట్లు రాగా టి ఆర్ ఎస్ కు 13,497, కాంగ్రెస్ కు 2,727 ఓట్లు వచ్చాయి. 
 
ఇక కీలకమైన బీహార్ లో ఎన్డీయే కూటమి 130 సీట్లలో ఆధిక్యతలో ఉండగా, ఆర్జేడీ కూటమి 100 సీట్లలో మాత్రమే ఆధిక్యతలో ఉంది. సుమారు 80 సీట్లతో బిజెపి అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించి అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలోని 2 సీట్లు, గుజరాత్ లోని 6 సీట్లలో బిజెపి దూసుకు పోతున్నది. 
మధ్య ప్రదేశ్ లోని 28 సీట్లలో 19 సీట్లలో, ఉత్తర ప్రదేశ్ లోని ఏడు సీట్లలో ఐదు చోట్ల బీజేపీ గెలుపు దిశగా వెడుతున్నది. గుజరాత్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ తన పట్టు నిలబెట్టుకుంటోంది. ఇవాళ వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో మొత్తం ఎనిమిది స్థానాల్లో ఏడు చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది.