కొద్ది కాలంలోనే మమత అధికారం కోల్పోతారు   

మరి కొద్ది కాలంలోనే మమత బెనర్జీ ముఖ్యమంత్రి  పదవిని కోల్పోతారని, ఈ చేదు నిజాన్ని భరించలేకనే ఆమె బీజేపీ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని బిజెపి యువమోర్చ అధ్యక్షుడు తేజస్వీ సూర్య విమర్శలు గుప్పించారు. 

గత ఒకటిన్నరేళ్లలో దాదాపు 120 మంది బీజేపీ కార్యకర్తలను మమత ప్రభుత్వం అత్యంత దారుణంగా హత్య చేయించిందని ఆరోపించారు. తాను ఒక్కటి మాత్రం చెప్పగలనని, బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలు చేస్తున్న త్యాగాలు, ఆత్మబలిదానాలూ ఎన్నటికీ వృథా కావని  స్పష్టం చేశారు. 

బెంగాల్ లో చ్చితంగా తమ పార్టీ అధికారంలోని వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో బీజేపీని అణచివేయడానికి సీఎం మమతా బెనర్జీ హింసకు పాల్పడుతున్నారని, రాజకీయ హత్యలకు సైతం వెనుకాడడం లేదని తేజస్వీ సూర్య ఆరోపించారు .

రాబోయే ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ జెండా ఎగురుతుందని, దాదాపు 200 సీట్లతో బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా చెప్పిన మాటలు త్వరలోనే నిజం కాబోతున్నాయని తేజస్వి సూర్య హర్షం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో పోలీసుల తీరుపై కూడా నిప్పులు చెరిగారు. రాష్ట్ర పోలీసులు చట్టాన్ని కాపాడాల్సిందిపోయి, తృణమూల్ పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.