బీజేపీ సీనియర్ నాయకుడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా సోకింది. శనివారం చేయించుకున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఫడ్నవీస్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు.
తాను కరోనా బారిన పడిన విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌లో ఉండాలని ఫడ్నవీస్ ట్విట్టర్‌లో కోరారు. వైద్యుల సూచన మేరకు చికిత్స తాను చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు.
ఇప్పటికే బీహార్ ఎన్నికలలో బీజేపీ ప్రధాన ప్రచార నేతలైన ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ, కేంద్ర మంత్రి షానవాజ్ హుస్సేన్ , పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రుడే లుకూడా పాజిటివ్‌గా తేలారు.
కాగా, దేశంలో అత్యధిక కేసులు ఉన్న ఆరు రాష్ట్రాల్లో రికవరీ రేటు 61శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 70,16,046 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. జాతీయ రికవరీ రేటు శనివారం 89.78శాతానికి చేరింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలో 61శాతానికి రికవరీలు పెరిగాయని మంత్రిత్వశాఖ పేర్కొంది.
దేశం రికవరీల్లో మహారాష్ట్రలో 20.6శాతం, ఏపీలో 10.9శాతం, కర్ణాటక 9.9, తమిళనాడులో 9.4, యూపీలో 6.1శాతం, ఢిల్లీలో 4.1శాతం నమోదైంది. ఇటీవల రికవరీ కేసులు తాజాగా కేసులను మించిపోయాయని కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 67,549 మంది మహమ్మారి నుంచి బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
గడిచిన 24 గంటల్లో 67,549 కోవిడ్ -19 రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,370 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో 80శాతం పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదు కాగా, కేరళ గరిష్టంగా 8వేలు, తర్వాత మహారాష్ట్రలో 7వేలు పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయని కేంద్రం పేర్కొంది.
దేశంలో తాజాగా 53,370 కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 78.14లక్షలకు చేరింది. తాజాగా 650 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా.. ఇప్పటికీ 1,17,956 మంది చనిపోయినట్లు కేంద్రం చెప్పింది. కొవిడ్ మరణాల రేటు 1.51శాతానికి తగ్గిందని, ప్రస్తుతం 6,80,680 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.
More Stories
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన ప్రధాని మోదీ
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి