జల వివాదాలను కేంద్రానికి ముడిపెట్టడం సరికాదు

జల వివాదాలను కేంద్రానికి ముడిపెట్టడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తోచిపుచ్చారు. జల వివాదాలను కేంద్రానికి ముడిపెట్టడం సరికాదని సీఎం కేసీఆర్ కు హితవు చెప్పారు. సీఎం జగన్‌తో కలిసి కేసీఆర్ భోజనం చేయగాలేనిది.. జల వివాదాలపై మాట్లాడటం చేతకాదా? అని ప్రశ్నించారు. 
 
కేసీఆర్ కావాలనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారని ఆరోపించారు. ఇద్దరు సీఎంలు కలిసి కూర్చుంటేమధ్యవర్తిత్వానికి కేంద్రం సిద్ధమని ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు మాట్లాడుకుంటే కేంద్రం అడ్డుపడిందా అని కిషన్‌రెడ్డి నిలదీశారు.
 
కాగా, కుట్రలో భాగంగానే కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించాయారు. ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదని  సంజయ్‌ ప్రశ్నించారు. 
 
అపెక్స్ కౌన్సిల్‌కు ముందే లేఖ రాయడం వెనుక అంతర్యమేంటని ప్రశ్నించారు. గతంలో అపెక్స్ కౌన్సిల్‌ సమావేశాన్ని కేసీఆర్ వాయిదా వేయించారని ఆయన గుర్తు చేశారు.