త్వరలోనే రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు  

త్వరలోనే రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు రెవెన్యూ, ఎల్ ఆర్ ఎస్ము, న్సిపల్ చట్టాలపై చర్చిద్దామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం చెప్పారు.

క్యాంప్ ఆఫీసులో ఆరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమీక్షలో ప్రజల నుంచి వస్తున్న అభిప్రయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.  ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఓటరు నమోదుపై చర్చించినట్టు తెలుస్తోంది. 

కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టంపై ప్రజలకున్న అపోహలను తొలగించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. చట్టాలు ప్రజల మేలుకోసమే చేసినవని, ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించారన్నారు. ప్రజలపై భారం పడకుండా ఎల్ ఆర్ ఎస్  రుసుము తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు.

ఎల్ ఆర్ ఎస్ పై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, అభిప్రయాలను ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యొగులు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు టీఆర్ఎస్ కు వ్యతిరేకమన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలో తేలిందని చెప్పారు.

జి హెచ్ ఎం సి,  దుబ్బాకలో కూడా పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలసత్వం ప్రదర్శించకుండా గెలుపు కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు.