టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా శోభరాజు

పద్మశ్రీ డాక్టర్ శోభరాజు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమిస్తూ బుధవారం ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె టిటిడి తరపున అన్నమాచార్య ప్రాజెక్టు సలహాదారుగా కొనసాగుతున్నారు. 
 
వేంకటేశ్వర స్వామికి భక్తు రాలైన శోభరాజు అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి ఎనలేని కృషి చేశారు. ‘అన్నమాచార్య భావనా వాహిని’ అనే సంస్థను ఏర్పాటు చేసి వేలాది మందిని  సంగీత  కళాకారులుగా శోభరాజు  తీర్చిదిద్దారు.  
 
సంగీత విద్వాంసురాలిగా శోభరాజు నియామకంపై టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందించారు.