కరోనాపరిస్థితులపై చర్చించేందుకు ప‌్రధాని నరేంద్ర మోదీ మరోమారు ముఖ్యమంత్రులతో భేటీకానున్నారు. ఈ సమావేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ముఖ్యమంత్రులతోపాటు మరో నాలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అకాశం ఉన్నదని చెబుతున్నారు.
ఈ సమావేశం వచ్చే బుధవారం (ఈనెల 23న) జరగున్ననదని తెలిసింది. దేశంలోని కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారని, కరోనా నియంత్రణకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని అధికారులు తెలిపారు.
గతంలో ఆగస్టు 11న కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బీహార్, గుజరాత్ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.
More Stories
కెనడాలో హిందూ ఆలయంపై దాడి పిరికిపంద చర్య
కాంగ్రెస్, ఆర్జేడీలు గిరిజన వ్యతిరేకులు
మహారాష్ట్ర డీజీపీపై ఎన్నికల సంఘం బదిలీ వేటు