పార్లమెంట్ సమావేశాలు బుధవారం వరకే?

పార్లమెంట్ సమావేశాలు బుధవారం వరకే?
పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్​ కంటే ముందే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడటంతో వచ్చే బుధవారంతో సమావేశాలను ముగించాలని కేంద్రం భావిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 
 
ఈమేరకు శనివారం జరిగిన లోక్​సభ బిజినెస్​ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీలు సమావేశాలను షెడ్యూల్​కంటే ముందే ముగించాలని సూచించిన్నట్టు తెలిసింది.
అక్టోబరు 1 దాకా సమావేశాలను నిర్వహిస్తే అది సభ్యుల ఆరోగ్య పరంగా రిస్క్‌ తీసుకున్నట్లు అవుతుందని బీఏసీ సమావేశంలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.  
 
పార్లమెంట్​ వ్యవహారాల కేబినెట్​ కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమావేశాలు మొదలైన తర్వాత ఇప్పటి వరకూ 30 మంది ఎంపీలు, 50 మంది పార్లమెంట్​ కాంప్లెక్స్​ ఉద్యోగులకు కరోనా పాజిటివ్​ వచ్చింది.